WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రేపల్లె'లో ఎమ్మెల్యే 'శ్రావణ్‌కుమార్‌' భార్య పోటీ..!?

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో..అధికార టిడిపిలో టిక్కెట్ల చర్చ రసవత్తరంగా జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపు 80 మందికి మళ్లీ టిక్కెట్లు ఇచ్చేది లేదని..అధిష్టానం సూచాయగా చెబుతుండడంతో..కొత్తవారిలో ఆశలు రేకెత్తుతున్నాయి. అదే సమయంలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారు..తమకు సీటు ఇవ్వకపోయినా...తమ కుటుంబంలో ఎవరికో ఒకరికి సీటు ఇవ్వాలని అధినేత 'చంద్రబాబు' వద్ద విజ్ఞప్తులు చేసుకుంటున్నారట. తాజాగా...గుంటూరు జిల్లా 'తాడికొండ' నియోజకవర్గంలో ఇటువంటి సంఘటనే జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుతం 'తాడికొండ' ఎమ్మెల్యేగా ఉన్న 'శ్రావణ్‌కుమార్‌'పై నియోజకవర్గ ఓటర్లు, టిడిపి కార్యకర్తలు, ఎంపిటిసిలు, జెడ్‌పిటిసిలు, ఇతర నియోజకవర్గ స్థాయి నాయకులు...ముఖ్యంగా 'చంద్రబాబు' సామాజికవర్గానికి చెందిన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయనను తొలగించాలని అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎస్సీ నియోజకవర్గమైన 'తాడికొండ'లో గత ఎన్నికల సమయం లో 'చంద్రబాబు' సామాజికవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు స్వంత సొమ్ములు ఖర్చు పెట్టుకుని...'శ్రావణ్‌'ను గెలిపిస్తే.. ఆయన గెలిచిన తరువాత..వారిని దూరం పెట్టారట.అదే సమయంలో 'శ్రావణ్‌'కు వ్యతిరేకంగా పనిచేసిన వారిని దగ్గరకు తీయడంతో..ఇప్పుడు..వారంతా..'శ్రావణ్‌'కు టిక్కెట్‌ ఇస్తే..తాము ఆయనను ఓడిస్తామని అధినేత 'చంద్రబాబు'కు ఆల్టిమేటమ్‌ ఇచ్చారట. అదీ కాక..గత నాలుగున్నరేళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న 'శ్రావణ్‌కుమార్‌' నియోజకవర్గంపై పట్టుసాధించలేక పోయారని..ఎమ్మెల్యేగా దూసుకుపోలేకపోయారని అధినేత భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఆయనను మార్చి వేరే వారికి సీటు ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.

  ఇదే విషయాన్ని..ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌కు 'చంద్రబాబు' స్వయంగా చెప్పి...ఏమి చేయమంటావో చెప్పమన్నారట. 'నీకు టిక్కెట్‌ ఇచ్చే పరిస్థితి లేదు..నియోజకవర్గంలో నీపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది...? నీపై వ్యక్తిగతంగా నాకు ఎటువంటి ద్వేషం లేదు..నియోజకవర్గంలో ఉన్న పరిస్థితిని బట్టి నీకు టిక్కెట్‌ ఇవ్వలేను..నీకు భవిష్యత్‌లో మంచి అవకాశాలు కల్పిస్తాను..అని సముదాయించి..ఏమి చేయాలో చెప్పమని కోరారట. దీనికి 'శ్రావణ్‌' స్పందిస్తూ...'సార్‌..నాకు...టిక్కెట్‌ ఇవ్వక పోయినా...ఫర్వాలేదు...నా భార్యకు టిక్కెట్‌ ఇవ్వాలని కోరారట. తన భార్య బీసీ సామాజికవర్గానికి చెందిన ఉన్నత విద్యా వంతురాలు..ఆమె డ్వామా పీడీగా పనిచేస్తున్నారు..ఆమెకు తమ స్వస్థలమైన 'రేపల్లె'లో టిక్కెట్‌ ఇస్తే...బాగుంటుందని సూచించారట. వాస్తవానికి 'శ్రావణ్‌కుమార్‌'ది రేపల్లె...ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న ఆయనను గత ఎన్నికల సమయంలో 'తాడికొండ' నుంచి టిడిపి బరిలోకి దింపడం...ఆయన వైకాపా అభ్యర్థిపై గెలవడం చకచకా జరిగిపోయింది. ఈ నేపథ్యంలో..ఇప్పుడు తన స్వస్థలంలో తన భార్యకు టిక్కెట్‌ ఇస్తే...ఆమెను గెలిపిస్తానని..శ్రావణ్‌ చెప్పినట్లు తెలుస్తోంది. 'రేపల్లె' ఎమ్మెల్యే 'అనగాని సత్యప్రసాద్‌'పై నియోజకవర్గంలో అసంతృప్తి వ్యక్తం అవుతున్న నేపథ్యంలో..ఆయన స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన 'శ్రావణ్‌కుమార్‌' భార్యకు టిక్కెట్‌ ఇస్తే...ఆమె గెలుపు సులువు అవుతుందన్న ఆలోచన అధిష్టానానికి 'శ్రావణ్‌' వివరించినట్లు తెలుస్తోంది. 'శ్రావణ్‌' భార్య 'గౌడ' సామాజికవర్గానికి చెందినది కావడం ప్లస్‌ మహిళ అవడంతో..ఆమె సునాయాసంగా గెలుస్తుం దనే అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది. అదే సమయంలో...బీసీల సీటు బీసీలకే ఇచ్చారని..వారికి అన్యాయం చేయలేదనే విషయం కూడా వారికి తెలుస్తుందని..పార్టీలోని ఓ వర్గం నేతలు అంటున్నారు. మొత్తం మీద..ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ చేసిన సూచనకు అధినేత సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుందని...ప్రచారం జరుగుతోంది. ఏమి జరుగుతుందో...చూద్దాం...!

(1602)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ