WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సాయిప్రసాద్‌' ఆశలకు కళ్లెం వేసిన 'సతీష్‌'...!

సిఎంఒ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న 'సతీష్‌చంద్ర' సిఎస్‌గా నియమిస్తే..తానే సిఎంఒ కార్యాలయ ఇన్‌ఛార్జి అవుతానని ముఖ్యకార్యదర్శిగా ఉన్న 'సాయిప్రసాద్‌' ఆశ పడ్డారట. కానీ..అనుకున్నదొక్కటి..అయినదొక్కటి సామెత చందంగా 'సాయిప్రసాద్‌' ఆశలకు కళ్లెం వేశారు 'సతీష్‌'. సిఎస్‌ పోస్టును 'సతీష్‌'  వద్దనుకుంటున్నారని తెలుసుకున్న 'సాయిప్రసాద్‌' కొన్నాళ్లు దిగాలుగా కనిపించారట. ఇప్పటికీ 'సాయిప్రసాద్‌'కు సిఎం ఎంతో విలువ ఇస్తారని..ఎలాంటి పనినైనా చేయించగలిగిన సత్తా 'సాయిప్రసాద్‌'కు ఉందని అందుకు నిదర్శనమే విద్యుత్‌శాఖ పరిధిలోని ఒక సంస్థకు సిఎండిగా బాధ్యతలు నిర్వహిస్తున్న 'దొర'ను ముఖ్యమంత్రి తప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు ఆ పోస్టు నుంచి 'దొర'ను తప్పించవద్దని 'సాయిప్రసాద్‌' ఒత్తిడి తెచ్చినా సిఎస్‌ దినేష్‌ సూచనలతో 'సిఎం' తప్పించడం జరిగింది. ఈ మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ..మళ్లీ ఆయననువిశాఖపట్నంలో సిఎండిగా నియమించారు. ఈ నియామకం వెనుక 'సాయిప్రసాద్‌' ఒత్తిళ్లు పనిచేశాయని..ఇందనశాఖలో ప్రచారం జరిగింది. అప్పటికే అంత శక్తి ఉన్న 'సాయిప్రసాద్‌' ఇప్పుడు అంతకన్నా రెట్టింపు బలం పుంజుకున్నారని..ముఖ్యమంత్రి ఆయన చెప్పింది వేదంలా పాటించి నిర్ణయం తీసుకుంటారని అధికారవర్గాల నమ్మకం. 

  ఎంత ముఖ్యమంత్రి తన మాట విన్నా..సిఎంఒ ఇన్‌ఛార్జి పోస్టు చాలా ప్రాధాన్యత ఉంటుంది..'సతీష్‌' ఉన్నన్నాళ్లు తనకా పోస్టు దక్కదని..ఆయనను ఆ పోస్టు నుంచి తప్పించడం కష్టం..సిఎస్‌ పోస్టు సతీష్‌కు దక్కితే...తనకా పోస్టు దక్కుతుందని ఆయన ఆశపడ్డారు. కానీ ఆయన ఆశలు నిరాశ అయ్యాయి. ఇదంతా తనపై జరుగుతున్న దృషప్రచారమని తాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు నమ్మకస్తుడినని..తాను విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటానని..'సాయిప్రసాద్‌' చెబుతున్నారట. కారణాలు ఏమైనా...సిఎస్‌పోస్టును 'సతీష్‌' కోరుకోలేదు..ఆ పోస్టు కోసం ప్రయత్నించలేదూ..కానీ ఎనిమిది నెలలు సర్వీసు ఉన్న 'పునీతా'ను సిఎస్‌గా నియమించడంలో 'సతీష్‌' కీలకపాత్ర పోషించారని తెలుస్తోంది. నిన్న కాక మొన్నే..సిఎస్‌గా 'పునీతా'కుసిఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఆ సమయంలో 'సతీష్‌' అమెరికాలోనే ఉన్నారు. ఆయనెలా సిఫార్సు చేస్తారని సన్నిహిత వర్గాలు చెబుతున్నా...సత్తా ఉంటే ఎక్కడున్నా..ఎవరినైనా..సాధించగల నేర్పు, ఓర్పు తెలివితేటలు 'సతీష్‌'కు ఉన్నాయనడంలో యధార్థం. ఆయన సిఎంకు అత్యంత నమ్మకస్తుడు..ఈ విషయం అధికారులకు తెలుసు..ఇతర ముఖ్యులకు తెలుసు. 'పునీతా'ను సిఎస్‌గా నియమిస్తారని 'సతీష్‌'కు ముందే తెలుసనని..అందుకే పర్యటన ముగిసినా..'సతీష్‌' అమరావతి రాలేదని...తరువాత నింపాదిగా వచ్చారని కొందరు చెబుతున్నారు. 'పునీతా'ను సిఎస్‌గా నియమించడంలో 'సతీష్‌' పాత్ర తోచిపుచ్చలేనిదని సచివాలయ వర్గాలు అంటున్నాయి.

(303)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ