WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అక్టోబర్‌8న చంద్ర‌బాబు కుటుంబంపై ఐటి దాడులు చేస్తారా...!?

తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ 'రేవంత్‌రెడ్డి' ఇంటిపై, బంధువుల ఇంటిపై ఐటి దాడులు చేసిన అధికారులు...తరువాత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిపై, ఇతర ఆస్తులపై దాడులు చేయబోతున్నారని కొన్ని పత్రికలు, సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. మూడు రోజుల పాటు 'రేవంత్‌రెడ్డి' ఇంటిపై దాడులు చేసిన ఐటి అధికారులు..ఆయనను పలు రకాలుగా ప్రశ్నించారని...ఆయన ఇచ్చిన సమాచారంతో ఇప్పుడు 'చంద్రబాబు, లోకేష్‌'లపై దాడులు చేయబోతున్నారని ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోంది. 3వ తేదీన 'రేవంత్‌రెడ్డి'ని అరెస్టు చేస్తారని, ఆయనతో పాటు ఓటుకు నోటు కేసులో ఉన్న సెబాస్టియన్‌ ఇతరులను కూడా అరెస్టు చేస్తారని తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో పట్టుబడిన రూ.50లక్షలు ఎవరవని ఇప్పటికే ఐటి అధికారులు 'రేవంత్‌రెడ్డి'ని ప్రశ్నించారు. వాటిని ఇచ్చింది....అప్పటి మీ బాసేనా..? అని పలుసార్లు ప్రశ్నించారట. 'రేవంత్‌రెడ్డి'పై దాడుల వెనుక లక్ష్యమే 'చంద్రబాబు' అని...ముందుగా ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన 'రేవంత్‌రెడ్డి'ని అరెస్టు చేసి..తరువాత మిగతా వారి సంగతి చూడాలని ఢిల్లీ పెద్దల నుంచి ఐటి అధికారులకు ఆదేశాలు అందాయట. 

 మూడు రోజుల పాటు 'రేవంత్‌రెడ్డి' ఇంటిలో సోదాలు చేసిన ఐటి అధికారులు అనుకున్న రీతిలో సమాచారాన్ని సేకరించలేక పోయారు. కానీ..ఆయనకు వేల కోట్లు ఆస్తులు ఉన్నాయని..ఇవన్నీ 'చంద్రబాబు' బినామా తాలుకా..అంటూ ప్రచారం చేశారు. మీడియా కూడా దానికి తోడై 'చంద్రబాబు' ఆస్తులకు 'రేవంత్‌రెడ్డి' బినామీగా ఉన్నారని ప్రచారం చేసింది. విదేశాల్లో పెద్ద ఎత్తున్న నిధులను 'చంద్రబాబు, రేవంత్‌రెడ్డి'లు తరలించారని...ఊదరగొట్టింది. అయితే తీరా చూస్తే...'ఓటుకు నోటు కేసు'నే ప్రధాన ఆయుధం గా చేసుకుని 'బిజెపి' పెద్దలు ఐటిని ఉసిగొల్పారని తెలుస్తోంది. తాజాగా...ఓటుకు నోటు కేసులోనే 'రేవంత్‌రెడ్డి'ని అరెస్టు చేసి..అనంతరం 'చంద్రబాబు'పై దాడులు చేయాలని ఢిల్లీ పెద్దలు ఆదేశించారని తెలుస్తోంది. అక్టోబర్‌8వ తేదీన ఒక సంచలన విషయం జరగబోతోందని..కొన్ని పత్రికలు, సోషల్‌మీడియా ఒకటే ఊదరగొడుతోంది. సంచలన విషయం ఏమిటో చెప్పకుండా...'చంద్రబాబు'ను లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఆ రోజున ఆయనపై,మంత్రి లోకేష్ వారి సంస్థ‌లపై ఐటి దాడులు జరుగుతాయని అన్యాపదేశంగా చెబుతున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో...త్వరలోనే తేలుతుంది. మొత్తం మీద..తమను ఎదిరించిన 'చంద్రబాబు'కు పాఠం నేర్పాలనే లక్ష్యంతో 'మోడీ, అమిత్‌షా'లు ఒకదాని తరువాత మరో వ్యూహం పన్నుతున్నారని మరి 'చంద్రబాబు' వారికి దొరుకుతారో..లేదో చూడాలి మరి.  

(3153)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ