WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సిఎంఒలో, మంత్రుల కార్యాలయాల్లో 'జగన్‌' అభిమాన జర్నలిస్టుల హడావుడి...!

2014 ఎన్నికలకు ముందు వైకాపా అధికారంలోకి రావడం ఖాయం. జగన్‌ ముఖ్యమంత్రి అవుతారు..అని హైదరాబాద్‌ సచివాలయంలో వాదోపవాదాలకు దిగిన వారు ఆ తరువాత పరిస్థితులు తారుమారు అయి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తరువాత కొంత కాలం మొహం చాటేశారు. ఆ విధంగా మొహం చాటేసిన వారిలో 'జగన్‌'కు వీరాభిమాని..సాక్షి ఛానెల్‌లో యాంకర్‌గాపనిచేస్తోన్న 'కొమ్మినేని శ్రీనివాసరావు' శిష్యులు కూడా ఉన్నారు. ఎవరైతే వాదనలకు దిగి..చంద్రబాబు కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం చేసిన వారెవరూ..సిఎం కార్యాలయానికి కానీ...మంత్రుల కార్యాలయాలకు కానీ వెళ్లరు. సచివాలయంలో మంత్రుల కార్యాలయంలో, సిఎం కార్యాలయంలో ఏమి జరుగుతుందో ఎప్పటికప్పుడు సానుభూతి పరులైన వారిలో కొందరు మీడియా ప్రతినిధులమని చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. ఇటీవల చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని వాదించిన జర్నలిస్టులు ఇద్దరు ఏదో పనిమీద మంత్రి కార్యాలయానికి వెళితే...'జగన్‌' ముఖ్యమంత్రి అవుతారని వాదించిన వారు ఇప్పుడు మంత్రుల కార్యాలయాల్లో హడావుడి చేయడంతో ఖంగుతిన్నారు. విచిత్రమైన విషయం ఏమిటంటే..మంత్రుల కార్యాలయంలో పనిచేసే అంతరంగిక సిబ్బంది కూడా చంద్రబాబు వ్యతిరేకులైన జర్నలిస్టులతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు. ఒకవైపు సచివాలయంలో 'జగన్‌' సానుభూతిపరులైన అధికారులు, ఉద్యోగులు సమాచారాన్ని ఎప్పటికప్పుడు వైకాపాకు అందజేస్తున్నారనే విమర్శ ఉంది. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నటైపులో జర్నలిస్టుల ముసుగులో మంత్రుల కార్యాలయాల్లో కనిపిస్తూ..వైకాపా నేతలకు సమాచారాన్ని అందజేస్తున్నారు. 

  ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా ఈ వ్యతిరేకులు కనిపిస్తుండడంతో 'చంద్రబాబు' ముఖ్యమంత్రి అవుతారని వాదించిన జర్నలిస్టులు వాళ్లను చూసి నోరెళ్లబెట్టి...ఇదేమిటి..మీరు ఇక్కడ అంటే...తాము వారంలో మూడు రోజులు..ఇక్కడే ఉంటామని చెప్పారు. సిఎంఒ కార్యాలయంలో వీరు తచ్చాట్లాడుతూ అందరికీ కనిపిస్తున్నారు. వై.ఎస్‌ హయాంలో టిడిపి సానుభూతిపరులైన జర్నలిస్టులైన వారు కానీ, ఆయన సామాజికవర్గానికి చెందిన జర్నలిస్టులు కానీ సిఎం కార్యాలయానికి వెళితే దొంగను చూసినట్లు చూసేవారు..మీరు ఇక్కడకు రాకూడదు..అని చెప్పేవారు. అప్పట్లో మంత్రుల కార్యాలయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన జర్నలిస్టులను టిడిపి ఏజెంట్లగా భావించేవారు. అటువంటి అవమానాలను భరించిన జర్నలిస్టులు..2014లో చంద్రబాబుకు అనుకూలంగా ప్రచారం చేయగా...చంద్రబాబుకు వ్యతిరేకులైన జర్నలిస్టులు 'జగన్‌' వైపు ప్రచారం చేశారు. అయితే 'చంద్రబాబు' ముఖ్యమంత్రి అయిన తరువాత...'జగన్‌' అనుకూల జర్నలిస్టులు అసెంబ్లీలోని 'చంద్రబాబు' చాంబర్‌లోనూ, మంత్రుల చాంబర్‌లోనూ..గత నాలుగేళ్లుగా కనిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వారే మంత్రులకు సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో 'చంద్రబాబు'కు అభిమానులైన 'జర్నలిస్టులు' ఖంగుతింటున్నారు. మంత్రుల కార్యాలయంలో సహాయకులుగా పనిచేస్తున్నవారిలో ఎక్కువ మంది మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేందుకు కూడా ప్రయత్నించడం లేదు. 'జగన్‌' సిఎం అవుతారని వీరు ప్రచారం చేస్తున్నారు. వై.ఎస్‌ హయాంలో అంటరానివారిగా ఎవరినైతే చూశారో..ఎవరినైతో..వారు భుజాన వేసుకున్నారో..చంద్రబాబు ముఖ్యమంత్రి అయి నాలుగేళ్లు గడిచినా..ఆయన వారిని మళ్లీ భుజనా వేసుకున్నారని, ఆయన కుమారుడు లోకేష్‌ కూడా అదే దారిలో నడుస్తున్నారు. ఈ విషయాన్ని సిఎంఒ కార్యాలయ కార్యదర్శికి చెప్పినా...మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా..ఇప్పటికీ వారే ఆయా కార్యాలయాల్లో అనేక పనులు చక్కపెట్టుకుంటున్నారనేది నూటికి నూరుశాతం వాస్తవం.

(339)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ