WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎక్సైజ్‌ మంత్రి 'జవహర్‌'పై అవినీతి దాడి...!

2014 ఎన్నికలకు ముందు ఆయనెవరో రాజకీయ, అధికార వర్గాలకు తెలియదు. అంతకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సేవ చేయలేదు. ఎవరెవరిని ఎలాపట్టుకున్నారో కానీ 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. విజయం సాధించారు..తరువాత కులం కోటాలో మంత్రి పదవిని పొందారు. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి కష్టపడ్డవారిని విస్మరించి గాలివాటంతో గెలిచిన నాయకుడు ఎవరెవరైతే స్వంత సొమ్ము ఖర్చుపెట్టుకుని గెలిచారో..అటువంటి వారిని పద్దతి ప్రకారం 'జవహర్‌' ఇబ్బందులు  పెడుతున్నారు..నాలుగేళ్లు ఆ నాయకుని వేధింపులు,సాధింపులు భరించాం..ఇంకెత కాలం భరించాలి.. అన్న సమయంలో పుండుమీద కారం చల్లిన విధంగా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు సిఎం చంద్రబాబు. దీనితో ఆయన సాధింపులు, వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఇటీవల కాలంలో మంత్రిపై వారంతా అవినీతి దాడి చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..ఒకప్పుడు సామాన్య టీచర్‌గా పనిచేసిన 'జవహర్‌' ఆ సంఘ నాయకులతో కలసి అక్కడక్కడికి పోతుంటేవారు. పదిమంది పరిచయమయ్యేవారు..ఆ విధంగా అయిన పరిచయాలే ఆయనను ఎమ్మెల్యే చేయగా..కులం కోటాలో మంత్రి పదవి ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు భారీగానే సత్కరించారు. మంత్రి అయిన తరువాత ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తుల వివరాలను ఆధారాలతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు, సిఎంఒ కార్యాలయానికి, పంచాయితీరాజ్‌ మంత్రి లోకేష్‌కు, పార్టీ అగ్రనాయ కులకు అందజేశారు. 

 నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక దందాలకు పాల్పడేవారిని మంత్రి జవహర్‌ భుజానవేసుకుంటున్నారని స్వంత పార్టీ నాయకులే రోడ్డెక్కి గొడవ చేస్తున్నారు. నిన్నా మొన్నటి వరకు అందరం కలసి పనిచేశాం..తాజాగా మంత్రి జవహర్‌ తమలో గ్రూపులను ప్రోత్సహిస్తూ పార్టీని వీధిన పెడుతున్నారని, మంత్రి పేరుతో ఆయన అనుచరులు దోపిడీలకు పాల్పడు తున్నారు..ఆయనెక్కడక్కెడ ఆస్తులు కొనుగోలు చేశారో వివరాలతో ఫిర్యాదు చేశారు. తిరువూరు నియోజకవర్గం గానుకపాడు మంత్రి స్వంత గ్రామం. ఆ గ్రామంలో లక్షలాది రూపాయలతో ఇళ్లు నిర్మించారని, ఖమ్మం జిల్లాల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేశారని, కొవ్వూరులో విలువైన అపార్ట్‌మెంట్లు, భారీ ఎత్తున్న నిధులు వెచ్చించి అధునాతమైన కారును కొనుగోలు చేశారని పలువురు నాయకులు ఫిర్యాదు చేశారు. మళ్లీ పోటీ చేసే అవకాశం 'చంద్రబాబు' ఇవ్వరని తెలుసుకున్న మంత్రి జవహర్‌ విచ్చలవిడిగా దోచేస్తున్నారని, విచారణ జరిపితే ఆధారాలతో వాస్తవాలు నిరూపిస్తామని స్థానిక నేతలు సవాల్‌ విసురుతున్నారు. మంత్రిని సమర్థిస్తున్న వారు కూడా ఆఫ్‌ ది రికార్డుగా ఆయన అవినీతిపై మాట్లాడుతున్నారు. అదృష్టం కలసి వచ్చి మంత్రి అయిన ఆయన తృప్తిపడడం లేదు..అక్రమంగా ఆయన ఎన్ని ఆస్తులు సంపాదించినా..పెద్దగా పట్టించుకోరు.. అధికారంలో లేనప్పుడు స్వంత సొమ్ములు ఖర్చు చేసిన వారిపైనే మంత్రి జవహర్‌ వేధింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. అప్పట్లో మంత్రి గెలుపుకు సహకరించిన కృష్ణబాబు సోదరుడు అచ్చిబాబు కూడా మంత్రి వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉండడంతో పాటు..వ్యవహారాలన్నీ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. 

 స్థానికంగా ఉన్న నాయకుల్లో ఎంతో మంది అర్హులు ఉన్నా..కృష్ణా జిల్లాకు చెందిన 'జవహర్‌'కు టిక్కెట్‌ ఇచ్చినా.. గౌరవించాం..గెలిపించాం..ఆఖరి నిమిషయంలో ఇటువంటి నాయకులను తెచ్చి తమనెత్తిన రుద్దుతున్నారని పలువురు స్థానిక నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంచాయితీరాజ్‌ మంత్రి లోకేష్‌ను కలసి వాస్తవాలను వివరించగా...మంత్రి జవహర్‌ తీరును వివరించగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని వారు చెబుతున్నారు. మంత్రిపై చేస్తోన్న ఆరోపణలు, విమర్శలు అవాస్తవ మని, కావాలనే ఆయనపై అసంతృప్తితో ఉన్న నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారని మంత్రి అనుచరులు ఎదురుదాడి చేస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో మంత్రి అనుచరులు ఇసుక దందాలతో పాటు ఇతర దందాలు కూడా బాగా చేస్తూ వెనకేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. అదేమిటని అడిగితే...కొవ్వూరులోనే  దందాలు ఉన్నాయా..? మిగతా చోట్ల లేవా..? అని మంత్రి అనుచరులు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా మంత్రి జవహర్‌ మళ్లీ కొవ్వూరులో పోటీ చేసే పరిస్థితి లేదని 'అచ్చిబాబు'కు సన్నిహితులైన వారు చెబుతున్నట్లు తెలిసింది. నియోజకవర్గంలో ఎవరిని పోటీ చేయించాలనే విషయంపై 'అచ్చిబాబు' సలహాను చంద్రబాబు తీసుకుంటారు..? ఆయన సలహానే చంద్రబాబు పాటిస్తారు. అచ్చిబాబు మనస్సులో ఏముందో తెలియదు కానీ..నూతన అభ్యర్థిపై ఆయన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని..సరైన సమయంలో తన నిర్ణయాన్ని ఆయన చంద్రబాబుకు చెబుతారని పార్టీ నాయకులు చెబుతున్నారు.

(2694)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ