WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వైజాగ్‌,ప.గో,కర్నూలు,ప్రకాశం జిల్లాల కలెక్టర్లు బదిలీ...!

ఎప్పటి నుండో కలెక్టర్లను బదిలీ చేస్తున్నారని ప్రచారం జరిగినా ఇంత వరకు ఆచరణలోకి రాలేదు. పశ్చిమగోదావరి, విశాఖ కలెక్టర్లు నాలుగేళ్ల నుండి అక్కడే బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వారిద్దరినీ బదిలీ చేయాలని ముఖ్యమంత్రి భావించినప్పటికీ ఆఖరు నిమిషంలో ఏదో సమస్య రావడం..ఆ ప్రతిపాదనలు నిలిచిపోవడం జరిగిపోయాయి. నిన్న..ఈరోజు జరిగిన అధికారుల చర్చల్లో 'పశ్చిమగోదావరి' జిల్లా కలెక్టర్‌ 'భాస్కర్‌'ను ప్రకాశంకు ప్రకాశం జిల్లా కలెక్టర్‌ 'నవీన్‌చంద్‌'ను వైజాగ్‌కు, వైజాగ్‌ కలెక్టర్‌ను 'పశ్చిమగోదావరి'కి కానీ లేదా కర్నూలుకు బదిలీ చేస్తారని తెలుస్తోంది. కర్నూలు కలెక్టర్‌ను పశ్చిమగోదావరికి మార్చే అవకాశం ఉంది. కానీ 'వైజాగ్‌' కలెక్టర్‌గా 'కాటంనేని భాస్కర్‌'ను నియమించవద్దని..మంత్రి గంటా శ్రీనివాసరావు పట్టుపట్టారట. అంతే కాకుండా సిఎంఒ అధికారి ఒకరు 'భాస్కర్‌'ను అక్కడ నియమించకుండా అడ్డుపడుతున్నారట. 

  ముఖ్యమంత్రి చంద్రబాబు 'గంటా',సిఎంఒ ఒత్తిడికి తలగ్గి ఆయనను 'ప్రకాశం'కు బదిలీ చేస్తారా..? లేక ఆయన సేవలను గుర్తించి 'వైజాగ్‌'కు బదిలీ చేస్తారా..? ఎవరిని ఎక్కడ నియమించాలనే దానిపై ముఖ్యమంత్రి ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోయినా...ఈ నాలుగు జిల్లాల కలెక్టర్లును బదిలీ చేయడం ఖాయం. 'భాస్కర్‌' విషయంలో మంత్రి గంటా చేసిన ఒత్తిడి ఫలించే అవకాశం ఉంది. 'నవీన్‌చంద్‌'ను 'వైజాగ్‌'కు బదిలీ అవుతారని..ఆయన స్థానంలో 'భాస్కర్‌' వస్తారని విశ్వసనీయంగా తెలిసింది. కర్నూలు, ప.గో..కలెక్టర్ల విషయం ఇంకా ఫైనల్‌ కాలేదు. కష్టపడి,నిజాయితీగా పనిచేసే కలెక్టర్లను వారు కోరుకున్న ప్రదేశంలో నియమించాల్సిన ప్రభుత్వ పెద్దలు ఒత్తిడికి తలగ్గి బదిలీ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అపార రాజకీయ అనుభవం ఉన్న 'చంద్రబాబు' కూడా ఒత్తిడికి తలగ్గుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంలో రాత్రింభవళ్లు పనిచేసిన 'కలెక్టర్‌ భాస్కర్‌'ను మంత్రి గంటా, సిఎంఒ అధికారి ఒత్తిడి తెచ్చారనే కారణంతో 'వైజాగ్‌'కు బదిలీ చేయకుండా...ప్రకాశం జిల్లాకు పంపించడానికి రంగం సిద్ధం చేశారంటే పరిస్థితి ఏమిటో స్పష్టం అవుతోంది.

(675)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ