WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌' 25సీట్లు ఇస్తే...పొత్తుకు 'పవన్‌' ఓకే...!

తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి రాయనీయని..అవసరమైతే దాని కోసం త్యాగాలు చేస్తానని చెబుతో 'జనసేన' అధినేత 'పవన్‌కళ్యాణ్‌' దాని కోసం కసరత్తులు చేస్తున్నారు. తాను ఒంటరిగా పోటీ చేస్తే..ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి...టిడిపికి లాభిస్తుందన్న భావనతో ఉన్న ఆయన వైకాపా అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డితో పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో 'చంద్రబాబు'ను ఓడించాలనే ధ్యేయంతో ఉన్న బిజెపి పెద్దలు కూడా దీని కోసం ఒక చేయి వేసి..'పవన్‌,జగన్‌'లు కలపడానికి రంగం సిద్దం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా,పవన్‌,బిజెపిలు బహిరంగంగా కలసి పోటీ చేయకపోయినా...అంతర్గతంగా కుమ్మక్కు అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 'బిజెపి'తో కుదిరిన అంతర్గత ఒప్పందం ప్రకారం ఇప్పటికే 'జగన్‌' కొన్ని సీట్లలో తన పార్టీ తరుపున అనామకులను నియమిస్తున్నారు. గుంటూరు-2 నియోజకవర్గమే దానికి నిదర్శనం కాగా..మరి కొన్ని చోట్ల బిజెపి కోసం ఇటువంటి కుమ్మక్కు అభ్యర్థులను రంగంలోకి దించడానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. బిజెపి విషయం తేలిన తరువాత..'పవన్‌' విషయంపై 'జగన్‌' దృష్టిసారిస్తారని తెలుస్తోంది. అయితే 'పవన్‌' కోరినన్ని సీట్లు ఇవ్వడానికి 'జగన్‌' అంగీకరించడం లేదట. సింగిల్‌ డిజిట్‌లో అయితేనే సీట్లు ఇస్తానని..అంతకంటే ఎక్కువ ఇచ్చేది లేదని ఆయన చెబుతున్నారట. కానీ...'పవన్‌' మాత్రం తనకు కనీసం 25 ఎమ్మెల్యే నాలుగు పార్లమెంట్‌ సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారట. దీనికి 'జగన్‌' అంగీకరించరని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 'పవన్‌,బిజెపి'లకు సీట్లు ఇస్తే...అవి టిడిపి ఖాతాలో పడిపోతాయని...టిడిపిని ఓడించే లక్ష్యంలో 'పవన్‌' త్యాగాలు చేయాలని 'జగన్‌' అంటున్నారట. అయితే మరీ నాసిరకంగా సింగిల్‌ డిజిట్‌ సీట్లు ఇస్తే..ఎలా అని 'పవన్‌' మధనపడిపోతున్నారని..అయితే...'టిడిపి'ని ఓడించాలనే లక్ష్యంతో ఉన్న 'పవన్‌' చివరకు ఆ సీట్లకైనా ఓకే అంటారని వైకాపా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.

(1139)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ