WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వై.ఎస్‌ విధేయ 'శత్రుచర్ల'పై అంత ప్రేమ ఏల..చంద్రబాబూ...!?

కాంగ్రెస్‌ ప్రభుత్వ హాయంలో పదేళ్లపాటు మంత్రి పదవులు నిర్వహించి ఆఖరి నిమిషంలో టిడిపిలో చేరి శ్రీకాకుళం పాతపట్నం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి 20వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన శత్రుచర్ల విజయరామరాజుకే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు పార్టీ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు. దివంగత వై.ఎస్‌కు వీరవిధేయుడని 'శత్రుచర్ల'కు పేరుంది. అంతే కాకుండా 1998లో ఎన్‌డిఎ ప్రభుత్వం ఒక ఓటుతో ఓడిపోవడానికి శత్రుచర్ల అనే విషయం చంద్రబాబు మరిచిపోయినట్లుంది. అటువంటి శత్రుచర్లకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే...ఈ రెండేళ్లపాటు ఆయన పార్టీ వాయిస్‌ వినిపించలేదు. పార్టీ సమీక్షలకు, సమావేశాలకు ఆయన హాజరవుతున్నారో...లేదో కానీ..ఆయనకు టిడిపిపై అంత సానుకూల అభిప్రాయం లేదు. పార్టీపై అభిమానం లేని శత్రుచర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎందుకు అంత అభిమానమో..తెలియదు కానీ..తాజాగా ఆయన భార్యకు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం చంద్రబాబు ఇస్తున్నారట. శత్రుచర్ల గిరిజనుడు కాదని..కోర్టు తీర్పు ఇవ్వడంతో...ఆయన 2004,2009లో పాతపట్నం నుంచి పోటీ చేసి విజయంసాధించి మంత్రి పదవిని కూడా నిర్వహించారు. శత్రుచర్ల గిరిజనుడు కాకపోతే...ఆయన భార్య గిరిజనజాతికి ఎలా చెందుతారనే ప్రశ్న ఎదురువుతుంది..? ఆమె గిరిజనురాలే అని అందుకు సంబంధించిన సర్టిఫికెట్లు ఉన్నాయని...శత్రుచర్ల వర్గీయులు చెబుతున్నారు. పదేళ్లుపాటు మంత్రి పదవి నిర్వహించి చంద్రబాబుపై విమర్శలు చేసిన ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇవ్వడంఏమిటి..? ఓడిపోతే ఎమ్మెల్సీ ఇవ్వడం ఏమిటి..? తాజాగా ఆయన భార్యకు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇస్తానని చెప్పడం ఏమిటి..? అని శత్రుచర్ల నియోజకవర్గ టిడిపి నేతలతో పాటు..ఆయనను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు అసలేం జరుగుతుందో తెలియక సతమతమవుతున్నారు.

(103)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ