WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పాలేరు'లో మంత్రి 'తుమ్మల' ఎదురీదుతున్నాడా...!?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చిన తరువాతే...తెలుస్తోంది...ఎవరి బలం ఎంతో...? ఎవరికి ప్రజాదరణ ఉందో...? ఎవరు గెలవబోతున్నారో...? అసలైన అంచనాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. మొన్నటి దాకా సెంచరీ కొడతామన్న వారికి పట్టపగలే చుక్కలు కనిపిస్తుండగా...అసలు గెలవలేమనుకున్న వారిలో ఆత్మవిశ్వాసం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఒంటరిగా పోటీ చేసి సత్తా చూపిస్తామని..ఎన్నికలకు తొమ్మిది నెలలు ముందే బరిలోకి దిగిన అధికార టిఆర్‌ఎస్‌..ఇప్పుడు ఒక్కో జిల్లాలో చేతులు ఎత్తేస్తోంది. మహాకూటమి దెబ్బకు మహామహా నాయకులు కూడా కుదేలవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో అధికార పార్టీ ఖాతా తెరవడం కూడా కష్టమని ఆ పార్టీ నేతలు చేయించుకున్న సర్వేలో తేలిందట. ముఖ్యంగా 'ఖమ్మం' జిల్లాలో అధికార పార్టీ ఇప్పటికే అన్ని విధాలుగా చేతులు ఎత్తేసిందని ప్రచారం జరుగుతోంది. మొన్న సినీనటుడు, టిడిపి ఎమ్మెల్యే 'బాలకృష్ణ' ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళితే ప్రజలు బ్రహ్మరథంపట్టడంతోనే..ఇక్కడ...టిఆర్‌ఎస్‌ నేతలు గుడ్లు తేలేశారు. ఎవరూ పిలవకుండానే...బాలకృష్ణ విగ్రహావిష్కరణకు దాదాపు 70వేల మంది అప్పటికప్పుడే పోగయ్యారు. దీన్ని చూసి టిఆర్‌ఎస్‌ నేతలకు నిద్ర కరవైందట. అసలే 'ఖమ్మం' జిల్లాలో టిఆర్‌ఎస్‌ బలం అంతంత మాత్రమే. ఇప్పుడు ఇక్కడ...టిడిపి,కాంగ్రెస్‌,సిపిఐలు కలిసి మహాకూటమిగా పోటీ చేస్తుండడంతో..దాదాపు అన్ని సీట్లల్లోనూ టిఆర్‌ఎస్‌ చేతులు ఎత్తేసిందట. కాగా నిన్న మొన్నటి వరకు 'మంత్రి తుమ్మల నాగేశ్వరరావు' అయినా గెలుస్తారని ప్రచారం జరగగా..ఇప్పుడు ఆయన గెలుపు కూడా కష్టమేనని నిన్న వచ్చిన సర్వే స్పష్టం చేసిందట. ఇక్కడ...మహాకూటమికి దాదాపు 67శాతం ఓట్లు వస్తాయని తేలిందట. అంటే...ఇక 'కెసిఆర్‌' ఈ జిల్లాలో తట్టా బుట్టా సర్దుకోవడమే.

  కాగా..ఎలాగైనా గెలవాలనే తపనతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అనుభవాన్నంతా రంగరించి ప్రచారం చేస్తున్నారు. అయితే...ఆయన ప్రయత్నాలు పెద్దగా సఫలమయ్యే పరిస్థితి మాత్రం 'పాలేరు'లో లేదని తెలుస్తోంది. మొదటి నుంచి కాంగ్రెస్‌కు గట్టిపట్టు ఉన్న ఈ నియోజకవర్గంలో ఇప్పుడు మరోసారి కాంగ్రెస్‌ అభ్యర్థి గెలవబోతున్నారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున మాజీ మంత్రి 'రామిరెడ్డి వెంకటరెడ్డి' విజయం సాధించారు. అయితే ఆయన 2016లో చనిపోగా ఇక్కడ ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ టిడిపిలో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పార్టీలో చేర్చుకుని ఉపఎన్నికల్లో పోటీ చేయించింది. ఈ ఎన్నికల్లో 'తుమ్మల' ఘనవిజయం సాధించారు. ఆయన దాదాపు 45వేల ఓట్ల మెజార్టీతో విజయంసాధించి సంచలనం సృష్టించారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సిట్టింగ్‌ శాసనసభ్యుడు మరణించినా...ఆ సానుభూతి పవనాలేమీ పనిచేయలేదని..తమ పార్టీ చేస్తోన్న అభివృద్ధి వల్లే 'తుమ్మల'కు అంత మెజార్టీ వచ్చిందని...టిఆర్‌ఎస్‌ నేతలు అప్పట్లో సంబరాలు చేసుకున్నారు. కానీ రెండేళ్లలో పరిస్థితి మారిపోయింది. సాధారణ ఎన్నికలకు ముందే ముందస్తు ఎన్నికలకు వెళుతున్న టిఆర్‌ఎస్‌కు ఇప్పుడు మహాకూటమి అభ్యర్థిని ఎదుర్కోవాల్సి రావడంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జిల్లా మొత్తం మహాకూటమి దెబ్బకు హడలి పోతుంటే...కాస్తా కూస్తో...'తుమ్మల' గెలుస్తారని భావించిన వారికి..ఇప్పుడు ఆయన గెలుపు కూడా సందేహమేనని అంటున్నారు. కాంగ్రెస్‌ బలం, టిడిపి,సిపిఐ బలం కలిస్తే...'తుమ్మల' ఇంటి బాట పట్టడం ఖాయమేనని..తేలిందట. మొత్తం మీద...'తుమ్మల' కూడా ఓడిపోతే...ఇక తెలంగాణలో టిఆర్‌ఎస్‌ గెలిచే సీట్లు డజన్‌కు మించి ఉండవని..రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చూద్దాం..ఏమి జరుగుతుందో..?

(517)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ