WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రూ.50లక్షల ముడుపుల ఐఎఎస్‌ అధికారిపై సచివాలయంలో చర్చ...!

నెలకు రూ.50లక్షలు ముడుపులు తీసుకుంటున్న ఐఎఎస్‌ అధికారిపై 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రచురించిన కథనం ఐఎఎస్‌ అధికారుల్లో సంచలనం సృష్టించింది. ఎవరా..? ఐఎఎస్‌ అధికారి..? ఆయనెక్కడ పనిచేస్తున్నారనే దానిపై ఆరా తీయడం ప్రారంభించారు. ఎవరికి తోచినట్లు ఫలానా..అధికారి..? అంటూ పరస్పరం చర్చించుకుంటున్నారు. ఈ అధికారిపై గతంలో ఒక పత్రికలో అవినీతి కథనం ప్రచురించిందని, ఆ కథనంలో పదికోట్లు రూపాయల విలువ గల గృహాన్ని ఆయన నిర్మించుకున్నారని పేర్కొన్నారు. 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రచురించిన కథనంలో పేర్కొన్న అధికారి...గతంలో వచ్చిన కథనంలో పేర్కొన్న అధికారి ఒకరేనా..? అని చర్చించుకోవడం జరిగింది. ఈ అధికారి ఎవరా..? అని తెలుసుకునేందుకు కొందరు అధికారులు తమకు తెలిసిన జర్నలిస్టులతోనూ, ఇతర అధికారులతోనూ...మాట్లాడి తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఫలానా..అధికారా..? లేదూ..ఆయన కాదా..? అంటూ సచివాలయంలో చర్చించుకున్నారు. ఎవరు..ఆ అధికారి అనేది ఆ శాఖ మంత్రికి తెలుసు..? ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ అధికారి వ్యవహారం ఎప్పుడో తెలిసింది. త్వరలో జరిగే అధికారుల బదిలీల్లో ఆయనను బదిలీ చేస్తారని సిఎంఒ అధికారులు చెబుతున్నారు. ఎవరు..? ఈ అవినీతి ఐఎఎస్‌ అని పలువురు ఆరా తీస్తుండగా..మరి కొందరు ఒక్కో అధికారి పేరును మాత్రమే పదే పదే చెబుతున్నారు. ఏది ఏమైనా 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌' ప్రచురించిన రూ.50లక్షల ముడుపుల అధికారి వ్యవహారం ఐఎఎస్‌ అధికారవర్గాల్లో సంచలనం సృష్టించడమే కాకుండా..సచివాలయంలో ఈ కథనం పరస్పర చర్చకు కారణమైంది.

(328)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ