WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అంబటి,బ్రహ్మనాయుడు'లకు 'జగన్‌' వార్నింగ్‌...!

గుంటూరు వైకాపా రాజకీయాలు మొత్తం మీద ఒక కొల్కిక్కి వస్తున్నాయి. నాలుగేళ్ల నుంచి ఇన్‌ఛార్జిలుగా పనిచేసిన వారందరినీ...ఏదో ఒక నెపంతో..పక్కకు తొలగించే కార్యక్రమం దాదాపుగా పూర్తి కావచ్చింది. మొదట చిలకలూరిపేట ఇన్‌ఛార్జిని మార్చిన 'జగన్‌' అదే ఊపులో 'పెదకూరపాడు,గుంటూరు-2,తాడికొండ అభ్యర్థులను మార్చివేశారు. ఇప్పుడు 'సత్తెనపల్లి, వినుకొండ' నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలుగా ఉన్న 'అంబటి రాంబాబు, బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు'లను కూడా మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల 'జగన్‌' తన వద్దకు 'అంబటి, బ్రహ్మనాయుడు'లను పిలిపించుకుని...హెచ్చరించినట్లు తెలిసింది. 

  మీరిద్దరి పనితీరు అసలు బాగాలేదు. మీరు నియోజకవర్గంలో దూసుకుపోవడం లేదు..? ఇలా ఉంటే ఎలా..? మరో నెల రోజులు సమయం ఇస్తాను...? ఆ లోపు కనుక మీలో మార్పు రాకపోతే...మిమ్మలను తొలగించి..వేరే వారికి నియోజకవర్గ బాధ్యతలు అప్ప చెబుతానని..తీవ్ర స్వరంతో హెచ్చరించినట్లు తెలిసింది. నాలుగేళ్ల నుంచి చూస్తున్నా..నియోజకవర్గంలో మీరు ముందుకెళ్లలేక పోతున్నారు...టిడిపి ప్రభుత్వంపై, ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది..అయినా మీరు పట్టుసాధించ లేకపోయారంటే... ఏమి చేయాలి..? ఇదే లాస్ట్‌ వార్నింగ్‌..నియోజవర్గంలో సత్తా చాటాలి..అదే సమయంలో సొమ్ములు కోసం చూసుకోకుండా ఖర్చు పెట్టాలి...అలా లేకపోతే...మీ ప్లేస్‌లో వేరే వారు ఉంటారని అర్థం చేసుకోవాలి...? వచ్చే ఎన్నికల్లో గెలుపే ముఖ్యం..గెలిచేవారే నాకు కావాలి...? ఇక మీ ఇష్టం...! 'అంబటీ'...నియోజకవర్గంలో మనకు ప్రజల నుంచి అపూర్వమైన ఆదరణ ఉంది..? కానీ..నీ వల్లే పార్టీకి మైనస్‌ అవుతోంది..? ఇక నీ ఇష్టం..నువ్వు ఎంత సన్నిహితుడివి అయినా...పార్టీ నష్టపోతే చూస్తూ ఊరుకోను..?అని 'జగన్‌' హెచ్చరించారని 'సత్తెనపల్లి' వైకాపా నాయకులు మీడియాకు ఆఫ్‌ ది రికార్డుగా చెబుతున్నారు. 

  అదే విధంగా వినుకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి 'బల్లా బ్రహ్మనాయుడు'ను కూడా హెచ్చరించారని తెలుస్తోంది. సొమ్ములు ఖర్చు పెట్టకుండా...మైలేజ్‌ రావాలంటే రాదాని..ఇప్పటికైనా సొమ్ముల మూటలను విప్పాలని...'బ్రహ్మనాయుడు'కి 'జగన్‌' చెప్పారని వినుకొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, నాయకులు చెప్పుకుంటున్నారు. మొత్తం మీద..త్వరలో 'అంబటి, బ్రహ్మనాయుడు' లను 'జగన్‌' పక్కన పెడతారని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ నుంచి సొమ్ములు బాగా పెట్టగలిగిన కొత్తవారు ఎవరైనా వస్తే..వారికే 'జగన్‌' టిక్కెట్‌ ఇస్తారని నియోజకవర్గ నాయకులు కొందరు చెబుతున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్‌, మనోహర్‌నాయుడు వంటి నాయకులనే పక్కన పెట్టిన 'జగన్‌'కు 'బ్రహ్మనాయుడు' ఎంత..? అని వారు ప్రశ్నిస్తున్నారు. త్వరలో ఆయనపై వేటు పడుతుందని...ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తోన్న గుంటూరుకు చెందిన డాక్టర్‌ను ఇన్‌ఛార్జిగా నియమిస్తారని తెలుస్తోంది. అదే విధంగా 'సత్తెనపల్లి'లో కూడా జరుగుతుందని చెబుతున్నారు..మరి కొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. ఏది ఏమైనా..గెలవలేని అభ్యర్థులను, సొమ్ములు ఖర్చు పెట్టని వారిని వదులుకోవా లని..'జగన్‌' నిర్ణయించు కున్నారని...ఈ కోవలోనే...'అంబటి,బ్రహ్మనాయుడు'లపై వేటు వేస్తారని జిల్లాలో ప్రచారం జరుగుతుంది. చూద్దాం..ఏమి జరుగుతుందో..!?

(3164)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ