లేటెస్ట్

ముగ్గురు ఐఎఎస్‌ల బదిలీ

రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు ముగ్గురు ఐఎఎస్‌ అధికారులను బదిలీ చేసింది. విజయనగరం జాయింట్‌ కలెక్టర్‌గా ఉన్న కె. వెంకట రమణారెడ్డిని బదిలీ చేసింది.ఆయనను ఖాళీగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ పోస్టులో నియమించింది. విజయనగరం జాయింట్‌ కలెక్టర్‌గా కిశోర్‌కుమార్‌ను నియమించింది. దివ్యాంగుల, ప్రత్యేక, సీనియర్‌ సిటిజన్స్‌ డైరెక్టర్‌గా ఉన్న కిశోర్‌ స్థానంలో జె.వెంకట మురళీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జె. వెంకటరమణ పోస్టింగ్‌ కోసం వేచి చూస్తున్నారు. ఆయనకు ప్రొటోకాల్‌లో డిప్యూటీ సెక్రటరీగా అదనపు బాధ్యలను కూడా అప్పచెప్పింది.  

(411)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ