లేటెస్ట్

'చంద్రబాబు' అరెస్టు...!

రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించడాన్ని నిరసిస్తూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తోన్న టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడున పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు టిడిపి సీనియర్‌ నేతలు అచ్చెంనాయుడు, సీపీఐ రామకృష్ణ, దేవినేని ఉమ, నారాలోకేష్‌ తదితరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బెంజ్‌సర్కల్‌ వద్ద నుంచి తొలుత జేఏసీ నేతలు పాదయాత్రగా వెళుతుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదని చెబుతూ నాయకులందరినీ అరెస్టు చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కార్యకర్తలు భారీగా పోలీసు వాహనాన్ని చుట్టుముట్టారు. వారందరినీ చెదరగొడుతూ పోలీసులు 'చంద్రబాబు' ఉన్నవాహనాన్ని తరలించుకుపోయారు. తమ నేతను అరెస్టు చేసి 'జగన్‌' తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నారని, ఇది ఆయన పతనానికి నాంది అని టిడిపి నేతలు విమర్శించారు. 

(464)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ