లేటెస్ట్

‘జగన్‌’కు బిగ్‌షాక్‌...!

సార్వత్రిక ఎన్నికలకు ముందు వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డికి బిగ్‌షాక్‌ తగిలింది. ఆ పార్టీ వ్యూహకర్త ‘ప్రశాంత్‌ కిశోర్‌’ ప్లేట్‌ ఫిరాయించి ‘జగన్‌’కు గట్టి షాక్‌ ఇచ్చారు. గత ఎన్నికల ముందు నుంచి వైకాపాకు వ్యూహకర్తగా పనిచేస్తోన్న ‘పికె’ నేడు ‘టిడిపి’ వైపు వచ్చేశాడు. వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఆయన వ్యూహకర్తగా ఉండబోతున్నాడు. గత కొన్నాళ్లుగా ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నా..అధికారికంగా దృవీకరణ కాలేదు. అయితే నేడు ‘ప్రశాంత్‌ కిశోర్‌’, టిడిపి ప్రధాన కార్యదర్శి ‘నారా లోకేష్‌’లు ఇద్దరూ ‘హైదరాబాద్‌’ నుంచి ‘విజయవాడ’కు ఒకే విమానంలో రావడం, తరువాత వారిద్దరూ కలసి ఒకే కారులో టిడిపి అధినేత ‘నారా చంద్రబాబునాయుడు’ను కలవడానికి వెళ్లడం జరిగింది. ‘లోకేష్‌’ ‘పికె’ల కలయిక రాష్ట్ర రాజకీయాల్లో అతి పెద్ద సంచలనంగా మారింది. ఇన్నాళ్లూ ‘వైకాపా’కు వ్యూహకర్తగా పనిచేస్తోన్న ‘ప్రశాంత్‌ కిశోర్‌’ టిడిపి వైపుకు రావడం ‘జగన్‌’కు షాక్‌ ఇచ్చినట్లే. గత ఎన్నికలకు ముందు ‘జగన్‌’ ‘ప్రశాంత్‌ కిశోర్‌’ను స్వయంగా పార్టీ నేతలకు, కార్యకర్తలకు పరిచయం చేశారు. గత ఎన్నికల్లో తమ ఘనవిజయానికి ‘పికె’నే కారణమని తరువాత పలుసార్లు అంతరంగిక సమావేశాల్లో ‘జగన్‌’ చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత కూడా ‘పికె’ టీమ్‌ ప్రభుత్వ కార్యక్రమాల్లో, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంది. అయితే..ఇప్పుడు హఠాత్తుగా ‘పికె’ టిడిపి శిబిరంలోకి వెళ్లడం ‘వైకాపా’ వర్గాలను నివ్వెర పరిచింది. 

ఎందుకు ‘పికె’ ఇప్పుడు టీమ్‌ మార్చాడు..అనే దానిపై రకరకాలైన విశ్లేషణలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ‘టిడిపి’ విజయం ఖాయమైనందునే ‘పికె’ ‘టిడిపి’ వైపుకు వచ్చారనే ప్రచారం ఉంది. ఎన్నికలకు ఎప్పుడు జరిగినా ‘టిడిపి’ ఘనవిజయం సాధిస్తుందనే మౌత్‌టాక్‌ గత కొన్నాళ్లుగా ఉంది. ఏడాది క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడుకు మూడు ‘టిడిపి’ విజయం సాధించడంతో..వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో..ముందుగానే కొందరికి అర్థం అయింది. అయితే ‘జగన్‌’ 175కు 175 వస్తాయనే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కొందరు..ఆ ప్రచారాన్ని నమ్మడం, మరికొందరు మౌనంగా ఉండడం, కొన్ని అమ్ముడుపోయిన మీడియా సంస్థలు ‘జగన్‌’కు 25కు 25 పార్లమెంట్‌ సీట్లు వస్తాయని ప్రచారం చేయడంతో...టిడిపి విజయం అంత సులువు కాదనే అభిప్రాయంతో ఉన్నారు. అయితే..‘చంద్రబాబు’ అరెస్టు తరువాత ‘టిడిపి, జనసేన’ కలిసిపోటీ చేస్తామని ప్రకటించడంతో..ఇక ‘టిడిపి’దే గెలుపు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగడం అక్కడ ఎంతో కొంత అభివృద్ది చేసిన ‘కెసిఆర్‌’ను ప్రజలు ఓడిరచడంతో..ఇక్కడ అరాచకాన్ని సృష్టించిన ‘జగన్‌’ ఓటమి ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలు ‘జగన్‌’ పాలనతో విరక్తి చెందడంతో..ఇక ‘జగన్‌’ ఓటమి తధ్యమనే భావన సర్వత్రావ్యాప్తి చెందింది. ఇది ఇలా ఉంటే..సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందనే సాకుతో వారిని వేరే చోటికి పంపించడం, కొంతమందికి టిక్కెట్లు నిరాకరించడం..వంటి కారణాలతో..‘జగన్‌’ కూడా ఓటమికి మానసికంగా సిద్ధమయ్యారనే భావన రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. ఇటువంటి పరిస్థితులను గ్రహించి ‘పికె’ ఇప్పుడు టిడిపి వైపు వచ్చారనే ప్రచారం సాగుతోంది. కాగా..‘పికె’ టిడిపికి సేవలు అందించేందుకు రావడం కొంత మంది పార్టీ సానుభూతిపరులకు, కార్యకర్తలకు నచ్చడం లేదు. అతను పీకేదేమీ లేదని, తనవల్లే టిడిపి గెలిచిందనే ప్రచారం చేసుకోవడం కోసమే..ఆయన ఇప్పుడు తమ వైపు వస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. కాగా..‘పికె’ తమ వైపుకు రావడం మానసికంగా ‘జగన్‌’కు ఎదురుదెబ్బ అని, అతని సేవలు వాడుకున్నా..వాడుకోకున్నా..మానసిక యుద్ధంలో ‘లోకేష్‌’ ‘జగన్‌’పై పైచేయి సాధించారనే విశ్లేషణలు వస్తున్నాయి. మొత్తం మీద..ఎన్నికలకు ముందు ‘జగన్‌’కు దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ