లేటెస్ట్

ఎట్టకేలకు 'సాయిప్రసాద్‌'కు పోస్టింగ్‌...!

సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి 'సాయిప్రసాద్‌'కు ఎట్టకేలకు పోస్టింగ్‌ దక్కింది.ఆయనను ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండిగా నియమించారు. దీనితో పాటు ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ ఎక్స్‌అఫిషియో ప్రిన్సిపల్‌ సెక్రటరీగా నియమిస్తూ పోస్టింగ్‌ ఇచ్చారు. వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వకుండా పక్కన పెట్టారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఆయన సిఎంఒ కార్యాలయంలో ఆయన కీలకంగా పనిచేశారు. అప్పటి అధికార పార్టీకి 'సాయిప్రసాద్‌' అనుకూలంగా వ్యవహరించారనే గుర్రుతో వైకాపా ప్రభుత్వం దాదాపు ఆయనకు ఏడు నెలల నుంచి పోస్టింగ్‌ ఇవ్వలేదు. గత టిడిపి హయాంలో సిఎంఒ కార్యాలయంలో పనిచేసిన 'సతీష్‌చంద్ర, రాజమౌళి,సాయిప్రసాద్‌'గిరిజాశంకర్‌లు పనిచేయగా వీరిలో ఒక్క 'గిరిజాశంకర్‌' తప్ప మిగతా ముగ్గురికి పోస్టింగ్‌లు ఇవ్వలేదు. 'సతీష్‌చంద్ర, రాజమౌళి, సాయిప్రసాద్‌'లు పూర్తిగా టిడిపి పార్టీకి అనుకూలంగా పనిచేశారని, తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో అప్పటి ఇంటిలిజెన్స్‌ డిజి వెంకటేశ్వరరావుతో కలసి పనిచేశారని వీరిపై వైకాపా నేతలు విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత వీరి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. వారు హెచ్చిరంచిన విధంగా వారి పార్టీ అధికారంలోకి రావడంతో ఈ ముగ్గురికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టారు. ఇటీవలే 'సతీష్‌చంద్ర'కు పోస్టింగ్‌ ఇవ్వగా ఇప్పుడు 'సాయిప్రసాద్‌' పోస్టింగ్‌ లభించింది. మరో అధికారి అయిన 'రాజమౌళి'కి మాత్రం ఇంకా పోస్టింగ్‌ ఇవ్వలేదు. వాస్తవానికి ఆయన ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన అధికారి. ఇక్కడ డిప్యూటేషన్‌పై పనిచేయడానికి వచ్చారు. ఆయన డిప్యూటేషన్‌ సమయం అయిపోయినా..ఆయనను రిలీవ్‌ చేయలేదు..మరో వైపు ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకుండా ఇంకా వెయిటింగ్‌లోనే ఉంచారు. ఈ రోజు 'సాయిప్రసాద్‌'కు పోస్టింగ్‌ ఇవ్వడంతో..త్వరలోనే 'రాజమౌళి' విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటారని సచివాలయవర్గాలు అంటున్నాయి. 'సాయిప్రసాద్‌, రాజమౌళి'లు ఇద్దరూ 'చంద్రబాబు' సామాజికవర్గానికి చెందిన వారు కావడం ఇక్కడ గమనార్హం. 

'శశిభూషణ్‌కుమార్‌'కు అదనపు బాధ్యతలు..!

సర్వీసెస్‌, హెచ్‌ఆర్‌ఎం కార్యదర్శిగా పనిచేస్తోన్న 'శశిభూషణ్‌కుమార్‌'కు ఆంధ్రప్రదేశ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌,బాపట్లకు డిజిగా అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. ఇంత వరకు ఈ పోస్ట్‌లో ప్రభుత్వ మాజీ సిఎస్‌ ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం ఉండేవారు. ఆయన ఇటీవలే ధీర్ఘకాలిక సెలవులో వెళ్లడంతో 'శశిభూషణ్‌'కు ఆ బాధ్యతలు అప్పచెప్పారు. మరో వైపు ఆంధ్రప్రదేశ్‌ యావిగేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండిగా జె.ఎం.డి మురళీకి అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. 

(291)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ