లేటెస్ట్

రాజధానిపై వాదించే ప్రభుత్వ లాయర్‌కు రూ.5కోట్లు...!

'జగన్‌' ప్రభుత్వం రాజధానిని తరలించే విషయంపై గట్టిపట్టుదలతోనే ఉంది. ఇప్పటికే అసెంబ్లీలో మూడు రాజధానులకు సంబంధించి బిల్లు పాస్‌ చేయించుకున్న వైకాపా ప్రభుత్వం తాజాగా రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా హైకోర్టులోదాఖలైన పిటీషన్లపై న్యాయపోరాటానికి సిద్ధం అవుతుంది. ఇప్పటికే రాజధాని తరలింపుపై ప్రజాప్రయోజనాల వాజ్యాలు హైకోర్టులో విచారణకు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం తరపున వాదించేందుకు సీనియర్‌ న్యాయవాది 'ముకుల్‌ రొహత్కి'ని నియమించుకుంది. ఆయనకు ఈ కేసుకు సంబందించి రూ.5కోట్లు చెల్లించేందుకు ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ రోజు జీవో విడుదల చేసింది. ముందుగా 'ముకుల్‌'కు కోటి రూపాయలు అడ్వాన్స్‌ చెల్లిస్తామని ప్లానింగ్‌ సెక్రటరీ 'విజయ్‌కుమార్‌' ఉత్తర్వులు జారీ చేశారు. 'ముకుల్‌రోహత్కి' సుప్రీంకోర్టులో పేరు మోసిన లాయర్‌. ఆయన ఇంతకు ముందు అటార్నీజనరల్‌గా కూడా పనిచేశారు. రాజధాని తరలింపు విషయంపై ఇప్పటికే హైకోర్టులో వాదనలు జరుగుతుండగా ప్రభుత్వం 'ముకుల్‌'ను రంగంలోకి దించి ఎట్టి పరిస్థితుల్లో తన పట్టుదలను నెరవేర్చుకోవాలనే భావనతో ఉన్నట్లు కనిపిస్తోంది. న్యాయపరంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు 'జగన్‌' ప్రభుత్వం ముందుగానే అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. 

(686)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ