లేటెస్ట్

‘జగన్‌’ చెప్పిన వ్యక్తే ‘బిజెపి’ అధ్యక్షుడవుతారట...!?

‘ఢిల్లీ’ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయం ‘వైకాపా’కు బాగా కలిసివస్తున్నట్లు కనిపిస్తోంది. ఎప్పటి నుంచో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ అడుగుతుంటే ఇవ్వని బిజెపి పెద్దలు ఒకేసారి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో సమావేశం కాబోతున్నారు. ఈ రోజు సాయంత్రం ‘జగన్‌’ ప్రధానిని కల‌స్తుండగా...రేపు కేంద్ర హోంమంత్రి ‘అమిత్‌షా’తో భేటీ కాబోతున్నారని సమాచారం వస్తోంది. ‘ఢిల్లీ’ ఎన్నికల‌ దెబ్బతోనే ఒక్కసారిగా ‘జగన్‌’కు ‘బిజెపి’ పెద్దలు ప్రాధాన్యత ఇస్తున్నారని ‘ఢిల్లీ’ వర్గాల‌ ద్వారా తెలుస్తోంది. గత ఆగస్టు నుంచి ఎన్నోసార్లు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ కోసం ‘జగన్‌’ ప్రయత్నాలు చేస్తుంటే ఇవ్వకుండా, మరీ ముఖ్యంగా ఒకసారి ‘ఢిల్లీ’కి రమ్మని కూడా మొహం చాటేశారు. అయితే హస్తినలో ‘బిజెపి’ ఘోర ఓటమితో భవిష్యత్‌ అవసరాల‌ దృష్ట్యా ‘జగన్‌’ను దరిచేర్చుకునేందుకు ‘బిజెపి’ పెద్దలు ఒక్కసారిగా ఆయనపై ఎక్కడ లేని ప్రేమని కురిపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలు మరింత బల‌పడతాయని, తమిళనాడులో ‘డిఎంకె’, ఆంధ్రాలో ‘జగన్‌’, ఒరిస్సాలో ‘బిజీపట్నాయక్‌, తెంగాణలో ‘కెసిఆర్‌’ వంటి నేతలంతా ఒక ఫ్రంట్‌పైకి రాకుండా నివారించేందుకే ‘జగన్‌’ను దువ్వుతున్నారని, అందులో భాగంగా ఆయన కోరిన కోర్కెల‌ను తీర్చడానికి కూడా ‘బిజెపి’ పెద్దలు సిద్ధం అయ్యారనే మాట ఆయా వర్గాల‌ నుంచి వినిపిస్తోంది. రాష్ట్రానికి అవసరమైన నిధులు,మూడు రాజధానుల‌కు కేంద్ర ఆమోదం, మండలిరద్దు, ‘చంద్రబాబు’పై ప్రతీకారం తీర్చుకోవడం వంటి చిట్టాను ‘జగన్‌’ బిజెపి పెద్దల‌ ముందుంచబోతున్నారు. దీనికి బిజెపి పెద్దలు దాదాపుగా ఓకే అనవచ్చు. అయితే ఆసక్తికరమైన విషయంపై ఒక ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా తాను సూచించిన వారినే నియమించాని ‘జగన్‌’ బిజెపి పెద్దల‌ను కోరబోతున్నారని తెలుస్తోంది. 

ప్రస్తుతానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ‘కన్నా క్ష్మీనారాయణ’ ‘జగన్‌’పై దూకుడుగా వెళుతున్నారు. ఆయన పదవీకాలం పూర్తి అయిన దరిమిలా..ఆయన స్థానంలో నూతన అధ్యక్షుడిని నియమించాల‌ని బిజెపి పెద్దలు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర బిజెపిలో మూడు వర్గాలుగా ఉన్న నేతల‌ను ఒకదారికి తేవడం వారికి సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడినే కొనసాగించాల‌ని కొందరు నేతలు సూచిస్తుండగా, మరి కొందరు మాత్రం ఆయన విఫలం అయ్యారని, ఆయన స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాని కోరుతున్నారు. ఈ లిస్ట్‌లో ‘పురంధేశ్వరి, ఎమ్మెల్సీ వీర్రాజు, మాజీ మంత్రి పైడికొండల‌ మాణిక్యాల‌రావు, రాజ్యసభ సభ్యుడు ‘సుజనాచౌదరి’ ఎమ్మెల్సీ మాధవ్‌ తదితరులు ఉన్నారు. అయితే వీరిలో ‘సుజనాచౌదరి, పురందేశ్వరి’కి మాత్రం బిజెపి అధ్యక్షపదవి ఇవ్వవద్దని ‘జగన్‌’ సూచిస్తారని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల‌ వరకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ‘సుజనాచౌదరి’ని నియమిస్తారని ప్రచారం జరిగినా...‘జగన్‌’ అడ్డుకుంటారని ప్రచారం జరుగుతోంది. అసలు ‘సుజనాచౌదరి’ బిజెపిలో ఉండడానికే అర్హుడు కాదని, ఆయనను ఆ పార్టీ నుంచి తన్ని తరిమేయాని ‘అసెంబ్లీ’ సాక్షిగా ‘జగన్‌’ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ‘సుజనా’ బిజెపి అధ్యక్షుడు అయ్యే ప్రశ్నే లేదని, బిజెపిలో ఉండి తనను అన్ని విధాలుగా సమర్థిస్తున్న ‘సోమువీర్రాజు’, ఎమ్మెల్సీ మాధవ్‌ పేర్లను ‘జగన్‌’ బిజెపి పెద్దల‌కు సూచిస్తారని తెలుస్తోంది. మొత్తం మీద..బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు ఉండాలో తమ నేత నిర్ణయించబోతున్నారని వైకాపాకు చెందిన ఓ ఎంపీ పేర్కొన్నారు. 

(1070)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ