లేటెస్ట్

‘వైకాపా’ను మంత్రివర్గంలోకి ‘మోడీ’ ఆహ్వానించారా..?

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ‘ఢిల్లీ’ పర్యటనపై పలు రకాల‌ ఊహాగానాలు వస్తున్నాయి. గత ఆగస్టు నుంచి అపాయింట్‌మెంట్‌ ఇవ్వని ప్రధాని మోడీ ఒక్కసారీగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంపై రకరకాల‌ కథనాలు మీడియాలో వస్తున్నాయి. మీడియాలో వివిధ రకాలైన కథనాలు వచ్చినా...బిజెపి నేతలు మాత్రం ఇదంతా రొటీన్‌ వ్యవహారమేనని చెబుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానిని కలుస్తారని దీనిపై ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని, ప్రాధాన్యత కూడా ఇవ్వాల్సిన అవ‌స‌రం కూడా లేదంటున్నారు.  రాష్ట్ర సమస్యలు, రాజధాని సమస్య, స్వంత సమస్యల‌తో పాటు రాజకీయా గురించి కూడా ప్రధాని మోడీ, సిఎం జగన్‌ మాట్లాడుకుంటారని దీనిలో వింతేముందని కూడా వారు ముక్తాయిస్తున్నారు. వారిద్దరూ రాజకీయనాయకులు...అదే సమయంలో కీల‌కమైన స్థానాల్లో ఉన్నారు..రాజకీయంగా తమకు లాభం చేకూర్చే విషయాలు, ఇతర విషయాలు చర్చించుకుంటారు. అదే సమయంలో ఇరు పార్టీలు కలిసి పనిచేస్తే వచ్చే లాభల, నష్టాల‌ గురించి మాట్లాడుకుంటారని దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఆ నాయకులు వివరిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి ‘జగన్‌’ను ఒక ప్రత్యేక కారణంతో ‘ఢిల్లీ’ పిలిపించారని ప్రచారం జరుగుతోంది. మీడియా కథనాల‌ను పక్కన పెడితే, వైకాపా, బిజెపి నాయకు మాత్రం ఈ విషయంపై మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు.

కేంద్ర మంత్రివర్గంలోకి వైకాపా...!

ముఖ్యమంత్రి జగన్‌, ప్రధాని మోడీ చర్చల్లో వైకాపాను కేంద్ర మంత్రివర్గంలో చేరమని ఆహ్వానించారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీడియాలో ఇప్పటికే వచ్చింది. దీని గురించే ‘జగన్‌’ను రాజ‌ధానికి పిలిపించారని, ఈ విషయం గురించి ప్రధాని ‘జగన్‌’తో మాట్లాడారని అంటున్నారు. దేశ వ్యాప్తంగా ‘బిజెపి’కి మిత్రులు రాంరాం చెబుతున్న పరిస్థితుల్లో లోక్‌సభలో అతిపెద్ద పార్టీల్లో నాల్గో స్థానంలో ఉన్న వైకాపా తమతో ఉంటే బాగుంటుందనే ఆలోచనతో ‘మోడీ’ వైకాపాకు ఆహ్వానం పలికారని చెబుతున్నారు. వచ్చే ఉగాది నాటికి కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని,దానిలో వైకాపాకు చెందిన వారిని మంత్రులుగా చేర్చుకుని ఎన్‌డిఎ బహీనపడలేదనే సంకేతాలు ఇవ్వాల‌నే భావనతో కేంద్ర పెద్దలు ఉన్నారని ఆయా వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలోకి వైకాపాను ఆహ్వానించిన విషయంపై ‘బిజెపి’ నేతలు నోరు మెదకపోయినా...వైకాపాకు చెందిన ఓ ఎంపీ దీనిని సమర్థిస్తున్నారు. వైకాపా కేంద్ర మంత్రివర్గంలో చేరితే ఆ పార్టీకి రెండు నుంచి మూడు మంత్రి పదవులు ఇస్తామని ప్రతిపాదించారని తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో వైకాపా చేరితే..రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం టిడిపి అంతు చూడవచ్చునని, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవచ్చని ఆ ఎంపి వివరిస్తున్నారు. ఎన్‌డిఎలోకి వైకాపా వెళితే ఆ పార్టీ దూకుడు మరింత పెరుగుతుందని, తద్వారా రాష్ట్రంలో ఎదురు లేని స్థితికి చేరవచ్చనే ఆలోచన వైకాపా పెద్దల్లోనూ ఉందని కానీ..కొన్ని ప్రతిబంధకాలు...వారిని ఆలోచనలో పడేస్తున్నాయంటున్నారు. 

ప్రత్యేకహోదా మరిచిపోవాల్సిందే...!

‘మోడీ’ వైకాపాను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఇక ప్రత్యేకహోదాకు తిలోదకాలు ఇచ్చినట్లేనన్న భావన వైకాపా వర్గాల్లో ఉంది. ప్రత్యేకహోదాతో పాటు, సిపిఎ వంటి విషయాల్లో వైకాపా ఇరకాటం ఎదుర్కోవాల్సి ఉంటుంది. బిజెపి పెద్దలు ప్రత్యేకహోదా ముగిసిన అంశమని, దాని గురించి ‘జగన్‌’ అడిగితే ‘చంద్రబాబు’కు పట్టిన గతే పడుతుందని ఇటీవలే హెచ్చరించింది. మరో వైపు సిపిఎ విషయంలో రాష్ట్రంలోని మైనార్టీ వర్గాలు ఆందోళనపథంలో పయనిస్తున్నాయి. ఈ రెండు విషయాల్లో ఉన్న క్లిష్టత వ‌ల్ల‌ ‘జగన్‌’ కేంద్రమంత్రివర్గంలో చేరే విషయంపై ఆలోచిస్తున్నారని, ఒకవేళ వీటిని తోసిరాజని మంత్రివర్గంలో చేరితే రాబోయే కాంలో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయో...అన్న ఆందోళన వ‌ల్ల‌ ఆయన ఆలోచిస్తున్నారంటున్నారు. కేంద్రం తమంత తాముగా ముందుకు వచ్చి మంత్రి పదవు ఇస్తామంటుంటే తీసుకోకపోతే పార్టీలో అసంతృప్తి పెరుగుతుందనే అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో ఉంది. మరో వైపు 25మంది ఎంపీను గెలిపిస్తే..ప్రత్యేకహోదా తన్నుకుంటూ వస్తుందని ఎన్నిక ముందు చెప్పిన ‘జగన్‌’ మంత్రి పదవు కోసం దాన్ని పక్కన పెడితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందన్న భావన ఉంది. కాగా మరో వైపు తాము మంత్రివర్గంలో చేరమని కోరినా, వైకాపా స్పందించకపోతే...‘మోడీ’ అపార్థం చేసుకునే పరిస్థితి ఉందనే అభిప్రాయం కూడా పార్టీ వర్గాల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ‘జగన్‌’ ఏం చేస్తారనే దానిపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతుంది. మరో వైపు.. ప్రస్తుతం ఇదంతా ఊహాగానాలేనని, పూర్తిస్థాయి స్పష్టత రాలేదని, వచ్చిన తరువాత..దీనిపై ‘జగన్‌’ ఆలోచిస్తారని వైకాపా నాయకులు చెబుతున్నారు.

(830)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ