డ్రోన్ దాడులను అడ్డుకుంది స్వదేశీ "ఐరన్ డోమ్ "...!
భారత్‌పైకి పాకిస్థాన్ మిడతల దండులా వదిలిన డ్రోన్‌లను అడ్డుకుంది దేశంలో తయారు చేసిన స్వదేశీ ఐరన్ డోమ్ అట. దాదాపు 600లకు పైగా డ్రోన్‌లను పాకిస్థాన్ మిలటరీ దేశంలోని వివిధ ప్రాంతాలపైకి వదిలింది. అయితే వీటిని రష్యాలో తయారు అయిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా అడ్డుకుందనే ప్రచారం సాగింది. ఇది కొంత వరకే వాస్తవమని తెలుస్తోంది. వాస్తవానికి ఈ డ్రోన్‌లను అడ్డుకుంది భారత్ తయారు చేసుకున్న ఐరన్ డోమ్ సిస్టమట. డిఆర్‌డిఓ రెండు సంవత్సరాల వ్యవధిలో దీన్ని పటిష్టంగా తయారు చేసింది. ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ సిస్టమ్ హమాస్ నుంచి గాజా మరియు హోతీల నుంచి యెమెన్ దాడులను అడ్డుకున్నట్లే, భారత్ తయారు చేసిన అత్యాధునిక డ్రోన్ డిటెక్షన్, డిటర్, డిస్ట్రాయ్ సిస్టమ్ పాకిస్థాన్ ముష్కురులు వదిలిన డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకుని దేశాన్ని రక్షించిందని రక్షణశాఖకు చెందిన అధికారులు చెబుతున్నారు. టర్కీ, చైనాలో తయారు అయిన డ్రోన్‌లను భారత భద్రతా బలగాలు "అదృశ్య కవచం" సహాయంలో సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ఎడతెరిపిలేకుండా పాకిస్తాన్ ప్రయోగించిన ఈ డ్రోన్‌ల వల్ల భారత్‌కు ఎటువంటి నష్టం జరగలేదు. భారత్,పాకిస్థాన్ కాల్పుల విరమణ పాటించినా..అప్పుడప్పుడూ పాకిస్థాన్ డ్రోన్‌లతో భారత్‌పై దాడులు చేస్తూనే ఉంది. అయితే..భారత్‌కు ఉన్న ఈ స్వదేశీ ఐరన్‌డోమ్‌తో వాటికి చెక్ పెడుతోంది. మొత్తం మీద నిన్నటి దాకా రష్యా ఎస్-400 దేశాన్ని రక్షించిందనే ప్రచారం ఉన్నా..అది వాస్తవం కాదని, స్వదేశంలో తయారైన ఐరన్‌డోమ్ వల్లే ఇది జరిగిందని ఆలస్యంగా తెలుస్తోంది.