WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

జట్టు పగ్గాలు 'విరాట్‌'కే ఇస్తా...!

తానే కనుక సెలెక్టర్‌ అయితే మూడు ఫార్మాట్లలోనూ విరాట్‌ కోహ్లీకే జట్టు పగ్గాలు అందిస్తానని టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.జింబాబ్వే పర్యటనకు బయల్దేరే ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడాడు.తన కెప్టెన్సీ భవితవ్యాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి నిర్ణయిస్తుందని చెప్పాడు.కెప్టెన్సీ లేకున్నా ధోని క్రికెట్‌ను ఎంజాయ్‌ చేయవవచ్చు' అన్న టీమిండియా మాజీ డైరెక్టర్‌ రవిశాస్త్రి మాటలపై ఆయన స్పందించాడు.తన భవిష్యత్తుపైనే కాకుండా భారత జట్టు ప్రధాన కోచ్‌గా ఎలాంటి వ్యక్తి అయితే బాగుంటుందన్న ప్రశ్నకు ధోని వివరంగా సమాధానం ఇచ్చాడు. హిందీ అంతగా రాకపోయినా కొత్త కోచ్‌ ఇక్కడి సంస్కృతిని బాగా అర్థం చేసుకోవాలన్నాడు. 'కమ్యూనికేషన్‌ పెద్ద సమస్యేమీ కాదు. కొత్త ఆటగాళ్లకు ఇంగ్లిష్‌ పెద్ద అడ్డంకీ కాదు. హిందీ రావడం అవసరమే అయినా అదే ముఖ్యం కాదు. అత్యుత్తమ వ్యక్తినే ఎంపిక చేయాలి' అని ధోని చెప్పాడు.

(220)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ