లేటెస్ట్

ధీర్ఘకాలిక వ్యాధులున్న వారికే ‘కరోనా’ ముప్పు ఎక్కువ...!

ఇటలీలో తేలింది ఇదే...!

ప్రపంచాన్ని వణికిస్తోన్న ‘కరోనా’ వైరస్‌ ధీర్ఘకాలిక వ్యాధులున్న వారిపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తోందని ‘బ్లూమ్‌బర్గ్‌’ వార్త సంస్థ పేర్కొంది. ఇటలీలో నమోదైయిన  మరణాల్లో ధీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారే ఎక్కువగా చనిపోయారని, అదీ 80 సంవత్సరాల‌ పైబడిన వారే ఎక్కువగా చనిపోయారని పేర్కొంది. ఇటలీలో చనిపోయిన వారిలో 99శాతం మంది పాత వ్యాధుల‌తోనే చనిపోయారని, దాదాపు 2500 మంది ఇటలీలో చనిపోయారని, వీరిలో ఎక్కువ మంది అధిక వయస్సు కలిగిన వారే ఉన్నారు. ఇటలీలో మరణా రేటు ఎక్కువగా ఉండడానికి మొదటి కారణం వృద్ధుల‌ సంఖ్య ఎక్కువగా ఉండడమని ఒక అధ్యయనం పేర్కొంది. ప్రస్తుతం ‘కరోనా’ బాధితుల్లో ధీర్ఘకాలిక వ్యాధుల‌తో ఉన్నవారే మూడు వంతుల‌ మంది ఉన్నారని తెలిపింది. వీరిలో 75శాతం మంది అధిక రక్తపోటు ఉందని, 35శాతం మందికి డయాబెటిస్‌, మూడు వంతుల‌ మంది గుండెజబ్బుల‌తో బాధపడుతున్నారు. వీరిపైనే ‘కరోనా’ ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొంది. ఇటలీలో వైరస్‌ కారణంగా మరణించిన వారి సగటు వయస్సు 79.5 సంవత్సరాలు కాగా మార్చి 17 నాటికి 50ఏళ్ల లోపు వారు 17 మంది మరణించారు. 40 ఏళ్ల లోపు ‘కరోనా’ సోకిన వారిలో ఎవరూ చనిపోలేదు. మంగళవారం నాటికి ‘కరోనా’ వైరస్‌ పెరుగుదల‌ కొంచెం నెమ్మదించింది. 

(152)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ