లేటెస్ట్

‘సెర్బియా’ జైలు నుంచి ‘నిమ్మగడ్డ’ విడుదల‌

వాన్‌పిక్‌ కేసులో ‘సెర్బియా’ జైలులో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త ‘నిమ్మగడ్డ ప్రసాద్‌’ విడుదలైనట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా ‘సెర్బియా’ జైలులో ఉన్న ఆయనకు బెయిల్‌ వచ్చినట్లు సమాచారం. రస్‌ ఆల్‌ ఖైమా ఫిర్యాదుతో ఆయనను ‘సెర్బియా’ పోలీసులు అరెస్టు చేశారు. ‘సెర్బియా’ కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది. జైలు నుంచి విడుదలైన ‘నిమ్మగడ్డ’ నేరుగా హైదరాబాద్‌కు వచ్చారు. ఆయనను విమానాశ్రయ అధికారులు క్వారంటైన్‌ చేశారు. ‘కరోనా’ కారణంగా ఆయనను క్వారంటైన్‌ చేశారు.  ‘వాన్‌పిక్‌’లో భాగస్వామి అయిన ‘నిమ్మగడ్డ’ ‘రాస్‌ ఆల్‌ఖైమా’ పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడులు ‘జగన్‌’ కంపెనీల్లో ‘నిమ్మగడ్డ’ తరలించారని, తమ సొమ్ము తమకు చెల్లించాల‌ని రస్‌ ఆల్‌ ఖైమా అంతర్జాతీయ కోర్టులో ఫిర్యాదు చేసింది. దీంతో 2019 ఆగస్టుల్లో ‘సెర్బియా’లో పర్యటిస్తున్న ‘నిమ్మగడ్డ ప్రసాద్‌’ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా..‘నిమ్మగడ్డ’ను విడుదల‌ చేయించడానికి అధికార వైకాపా పెద్దలు ప్రయత్నాలు చేశారని, పలువురు ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని వార్తలు వచ్చాయి. అదే సమయంలో ‘సెర్బియా’ ప్రభుత్వంతో, రస్‌ ఆల్‌ఖైమా’ కంపెనీతో సంప్రదింపులు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన ‘జుల్పీరాజ్జీ’ అనే అతనికి మధ్యప్రాచ్య మరియు దూర ప్రాచ్య దేశాల‌ కోసం ప్రత్యేకప్రతినిధిగా నియమించారని ప్రచారం జరిగింది. మొత్తం మీద..‘నిమ్మగడ్డ’ విడుదల‌ కావడంతో ఎవరి కృషి ఉందో త్వరలో తేలుతుంది. 

(914)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ