లేటెస్ట్

కేరళ సిఎం ‘విజయ్‌’ను ‘జగన్‌’ ఆదర్శంగా తీసుకుంటారా..?

ప్రపంచాన్ని వణికిస్తోన్న ‘కరోనా’ వైరస్‌పై వివిధ దేశాల‌ అధ్యక్షులు, ఆయా రాష్ట్రా పాల‌కులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రపంచంలో ప్రతి దేశాన్ని పట్టిపీడిస్తోన్న ‘కరోనా’ను ఎదుర్కొనేందుకు వారు శాయశక్తులా కృషి చేస్తున్నారు. మన దేశంలో ప్రధాని మోడీ దీనిపై ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ప్రకటిస్తున్నారు. ‘కరోనా’ నియంత్రణ కోసం ‘ఆదివారం’ నాడు ‘జనతా కర్ఫ్యూ’ని అమలు చేస్తున్నామని, దీని కోసం అందరూ సహకరించాల‌ని ప్రజల‌కు పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా రోజు రోజుకు ‘కరోనా’ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని వివిధ రాష్ట్రాల‌ ముఖ్యమంత్రుల‌తో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించబోతున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఏమి సహాలు ఇస్తారో కానీ...ప్రస్తుతానికి ఆయన చేసింది మాత్రం కేవలం ‘జనతా కర్ఫ్యూ’ని అమలు చేస్తే..చాల‌న్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. చివరకు ‘కరోనా’ను ఎలా ఎదుర్కొంటున్నారనే అంశంపై ‘అమెరికా, చైనా, ఇటలీ’ తదితర దేశాల‌ సహాల‌ను కూడా ఆయన తీసుకోలేదు. కేవం ఉచిత సహాలు తప్ప...ఆచరణ పెద్దగా లేదనే విమర్శులు వస్తున్నాయి. ఆయన బాటలోనే పలువురు రాష్ట్రాల‌ ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్నారు. 

కాగా..మిగతా రాష్ట్రాల‌ సంగతి ఎలా  ఉన్నా ‘కేరళ’ రాష్ట్ర పాల‌కులు మాత్రం ‘కరోనా’ విషయంపై ఆచ‌ర‌ణాత్మక చ‌ర్య‌లు   తీసుకుంటున్నారు. చికిత్స లేని వైరస్‌ను ఎదుర్కోవడానికి రూ.20వేల‌ కోట్ల ప్యాకేజీని ఆ రాష్ట్రప్ర‌భుత్వం ప్రకటించింది. ‘కరోనా’ వ‌ల్ల‌ ఇబ్బందుల‌కు గురయ్యే వారి ఆరోగ్య చికిత్స కోసం రూ.500 కోట్లు కేటాయించింది. అదే విధంగా ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా ఉండేందుకు, పేద వారికి, కడు పేదవారికి..అవసరమైన రోజు వారీ ఖర్చుల‌ కోసం ముందుగానే రెండు నెలల‌ పెన్షన్లు విడుదల‌ చేసింది. అదే విధంగా ప్రజందరికీ ఉచిత రేషన్‌ పంపిణీ చేస్తోంది. కుటుంబ పథకం ద్వారా 2వేల‌ కోట్ల రూపాయ రుణాల‌ను మంజూరు చేసింది. సుభిక్షపథకంలో భాగంగా రూ.20/`కే భోజనాన్ని సరఫరా చేయబోతోంది. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు ఈ రకమైన చర్యల‌ను తీసుకుని...‘కరోనా’ను అదుపులోకి తేవడానికి వామపక్షప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. కేరళ ప్రభుత్వం ‘కరోనా’ను ఎదుర్కొంటున్న తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

క‌రోనా నిరంత‌ర ప్ర‌క్రియ అని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్‌లోని వైకాపా ప్రభుత్వం కూడా ఈ విధమైన చర్యలు చేపడుతుందా..? కేరళ ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగానే ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి, పేదల‌కు, రోజు వారీ కూలీల‌కు ఆహారం, ఇతర నిత్యావసర సరుకులు సరఫరా చేయాల‌నే సల‌హా పలువురు నుంచి వస్తోంది. ‘కరోనా’ దెబ్బకు ఉపాధి కోల్పోయిన వారిని ఈ విధంగా ఆదుకోవాల‌ని, ప్రజల‌ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ ఇటువంటి చర్యలు తీసుకోవాల‌ని వారు కోరుతున్నారు. మరి వైకాపా ప్రభుత్వం స్పందిస్తుందా..? చూడాలి మరి.

(196)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ