లేటెస్ట్

పారాసెట్‌మాల్‌, క్లోరోక్వైన్‌ మందుల‌తో ‘కరోనా’ తగ్గిందట...!

ప్రపంచాన్ని వణికిస్తోన్న ‘కరోనా’ వైరస్‌ను సాధారణ మందుల‌తో తగ్గించవచ్చని ‘ఢల్లీ’కి చెందిన వైద్యులు నిరూపించారట. 14మంది ఇటలీ టూరిస్టుల‌కు ‘కరోనా’ వైరస్‌ మార్చి మొదటి వారంలో సోకితే...వారిలో 11మందికి ‘కరోనా’నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారని ప్రముఖ ఇంగ్లీషు సైట్‌ ‘ప్రింట్‌’ తన కథనంలో పేర్కొంది. ఇటలీకి చెందిన వీరందరికీ సాదారణ మందులైన పారాసెట్‌మాల్‌, క్లోరోక్వైన్‌, లోపినావిర్‌, అజిత్రోమైసన్‌, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌’ మందులు ఇచ్చి ‘కరోనా’ వ్యాదిని నయం చేశారని ఆ సైట్‌ పేర్కొంది. ఢల్లీలోని ‘మేదాంత’ హాస్పటల్‌కు చెందిన వైద్యులు ఈ మందుతో ‘కరోనా’ వ్యాధిగ్రస్తుల‌కు వైద్యం చేసి ఫలితాల‌ను సాధించినట్లు తెలుస్తోంది. ఇటలీకి చెందిన ‘కరోనా’ బాధితులంతా 60 సంవత్సరాల‌కు పైబడిన వారేనట. 14మందిలో 11 మంది కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, మరో ఇద్దరికి పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిందని, మరొకరి పరిస్థితి మాత్రం క్లిష్టంగా ఉందని వారు పేర్కొన్నారు. మొత్తానికి ప్రపంచాన్ని వణికిస్తోన్న ‘కరోనా’ను సాధారణ మందుల‌తో తగ్గించవచ్చని, దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని, సరైన మందుల‌ను రోగ ల‌క్షణాను బట్టి వాడితే..వ్యాధి తగ్గుముఖం పడుతుందని ‘మేదాంత’ వైద్యులు రుజువు చేశారు.
(‘ప్రింట్‌’ కథనం కోసం ఇక్కడ https://theprint.in/health/paracetamol-chloroquine-google-translator-how-medanta-treated-italians-with-coronavirus/387144/క్లిక్‌ చేయండి)

(407)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ