లేటెస్ట్

‘కరోనా’ నుంచి కోలుకున్న 101 సంవత్సరాల‌ వృద్ధుడు...!

మహ్మరి ‘కరోనా’ సోకితే మరణం తథ్యమన్న భావనతో ఉన్న వారికి ఊరటనిచ్చే విషయం ఇది. ‘కరోనా’తో వృద్ధులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతుండగా...101 సంవత్సరాల‌ వృద్ధుడు అనూహ్యంగా ‘కరోనా’ నుంచి కోలుకున్నారు. అదీ ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్న ‘ఇటలీ’ లో కావడం గమనార్హం. పెద్ద వయస్సులో వారికి ‘కరోనా’ సోకితే వారి ప్రాణాలు పోతున్నాయని, 101 సంవత్సరాల‌ వయస్సులో ఉన్న వ్యక్తి కోలుకోవడం అరుదైన సంఘటనే కాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ‘కరోనా’ సోకిన వాకి మ‌నో ధైర్యాన్ని ఇది ఇస్తుంది.  

‘ఇటలీ’లో ‘కరోనా’ సృష్టిస్తోన్న విల‌యంతో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది పాజిటివ్‌తో ఆసుప‌త్రుల‌కు వస్తుండగా..వారికి వైద్యం అందించలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇటలీలోని ‘రిమిని’లో 101 ఏళ్ల వ్యక్తి కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఈ వ్యక్తిని మిస్టర్‌ ‘పి’ అని పిలుస్తారు. ‘మిస్టర్‌’ ‘పి’ గురించి ‘రిమివి’ వైస్‌ మేయర్‌ గ్లోరియా లిసి మాట్లాడుతూ ‘మిస్టర్‌’ ‘పి’ 1919లో జన్మించారు ఆయన గత వారం ‘కరోనా’తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఈ వ్యాధి నుంచి కోలుకోవడంతో అతని కుటుంబం అతనిని ఇంటికి తీసుకెళ్లింది. 100 సంవత్సరాల‌ కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి కోలుకోవడంతో మనందరి భవిష్యత్తు మరీ ప్రమాదంలో లేదని భవిష్యత్తుపై ఆశలు పెట్టుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. గడిచిన వారాల‌ నుంచి విచారకరమైన కథల‌ను ప్రతిరోజూ మనం చూస్తున్నామని, వైరస్‌ గురించి యాంత్రికంగా చర్చించుకుంటున్నామని, ముఖ్యంగా వృద్ధుల‌పై ‘వైరస్‌’ దూకుడుగా వ్యవహరిస్తుందని భావిస్తున్నాం. కానీ..‘మిస్టర్‌’ ‘పి’ మాత్రం బయటపడ్డారు అని ఆమె వ్యాఖ్యానించారు.  ప్రపంచ వ్యాప్తంగా ‘కరోనా’ గురించి భయపడుతున్న వేళ 101 సంవత్సరాల‌ వృద్ధుడు ఈ మ‌హ‌మ్మారి నుంచి కోలుకోవడం సంతోషకరమైన వార్తే. 

(591)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ