లేటెస్ట్

2013లోనే ‘కరోనా’ గురించి ‘ఈనాడు’ రాసింది...!

ప్రపంచాన్ని వణికిస్తోన్న ‘కరోనా’ గురించి 2013లోనే ఈనాడు పేపర్‌ ఒక వార్త రాసింది. 2013, ఫిబ్రవరి 20వ తేదీన ‘కరోనా కల‌వరం:ఆరుకు చేరిన మృతులు’ అంటూ వార్త ఇచ్చింది. సార్స్‌ తరహా ల‌క్షణాల‌తో వేధిస్తున్న కొత్తరకం వైరస్‌, ‘నోవెల్‌ కరోనావైరస్‌’కు బ్రిటన్‌లో ఒకరు మృతి చెందారని, బర్మింగ్‌హామ్‌లోని క్వీన్‌ ఎలిజిబెత్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రోగి మరణించారని పేర్కొంది. గతేడాది మధ్య తూర్పు ప్రాంతంలో బయటపడిన ఈ కొత్తరకం వైరస్‌ బారిన పన్నెండు మంది పడ్డారని, వారిలో ఆరుగురు మృతి చెందారని తెలిపింది. ఈ కొత్త రకం వైరస్ వ‌ల్ల‌ ప్రజానీకానికి ఎక్కువ ముప్పు పొంచి ఉందని, సాధారణ జలుబు, సార్స్‌, తీవ్రస్థాయి శ్వాసకోశ రుగ్మతలు దీని ల‌క్షణాని పేర్కొంది. ఈ వైరస్‌ ఊపిరితిత్తుల‌ మార్గాల‌ పొరల్లోకి చొచ్చుకెళ్లి, రోగ నిరోధక వ్యవస్థపైదాడి చేస్తుందని, ఇది మానవ కణాల్లో సమర్థంగా పెరుగుతున్నట్లు స్విట్జర్లాండ్‌లోని కాంటోనల్‌ ఆసుపత్రి పరిశోధకులు వోల్కెర్‌ ధీల్‌ పేర్కొన్నారని తెలిపింది. కాగా...ఎప్పుడో ఏడేళ్ల నాడే ‘కరోనా’ వైరస్‌ గురించి ప్రపంచానికి తెలిస్తే..అది..ఇప్పుడే ‘చైనా’ నుంచి అన్ని దేశాల‌కు పాకిందని  ప్ర‌చారం చేస్తున్నారు. అప్పట్లో ఈ వైరస్‌ ప్రభావం బాగా తక్కువగా ఉండడంతో దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు, ఏడేళ్ల తరువాత దాని విశ్వరూపాన్ని ప్రపంచం చూస్తోంది. మొత్తం మీద..పీకల‌ మీదకు వచ్చే వరకు ప్రజలు దేన్నీ సీరియస్‌గా తీసుకోరని, ‘కొరోనా’ విషయంలోనూ అంతే జరిగిందని, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ప్ర‌స్తుత ప‌రిస్ధితి ఉంది.

(1939)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ