లేటెస్ట్

తెలంగాణ‌లో తొలి క‌రోనా మ‌ర‌ణం...!

మ‌హ‌మ్మారి క‌రోనా వ‌ల్ల తెలంగాణాలో తొలి మ‌ర‌ణం చోటు చేసుకుంది. 74 సంవ‌త్స‌రాల వ్యక్తి ఒక ప్ర‌వేటు ఆసుప‌త్రిలో ఈ రోజు మ‌ర‌ణించారు. క‌రోనా ల‌క్ష‌ణాల‌తో అత‌ను ఆసుప‌త్రిలో చేరాడ‌ని, తీవ్ర జ్వ‌రం, శ్వాస‌తీసుకోవ‌డంలో తీవ్ర ఇబ్బందుల ప‌డ్డ ఆయ‌న చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన‌ట్లు ఆరోగ్య‌శాఖ మంత్రి ఈటెల రాజేంద‌ర్ తెలిపారు. ఈనెల 14వ తేదీన మ‌తప‌ర‌మైన కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు అత‌ను ఢిల్లీ వెళ్లార‌ని, అక్క‌డ నుంచి వ‌చ్చిన త‌రువాత జ్వ‌రం, క‌రోనా ల‌క్ష‌ణాలు ఉండ‌డంతో ఆసుప‌త్రిలో కుటుంబ స‌భ్యులు చేర్చ‌గా చికిత్స పొందుతూ మ‌ర‌ణించారని ఈటెల తెలిపారు. మ‌ర‌ణించిన వ్య‌క్తి కుటుంబ స‌భ్యుల‌ను క్వారంటైన్ కు త‌రిలించారు. 

(240)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ