‘సోనియా’ సూచనను ఖండిస్తున్నాం

చిన్న, మధ్యతరహా పత్రికల సంఘం గౌరవాధ్యక్షులు కె.రంగసాయి
‘కరోనా’ వల్ల భారతదేశ ఆర్థికపరిస్థితి తలకిందువుతుందని, భారత ఆర్థిక రంగాన్ని కాపాడడానికి దేశంలోని పత్రికలకు కనీసం రెండేళ్ల పాటు ప్రభుత్వం ప్రకటలను ఇవ్వకూడాదని ఏఐసీసీ అధ్యక్షురాలు ‘సోనియాగాంధీ’ చేసిన సూచనను తాము ఖండిస్తున్నామని చిన్న, మధ్యతరహా పత్రికల సంఘం గౌరవాధ్యక్షులు కె.రంగసాయి పేర్కొన్నారు. ఆమెది బ్యాడ్ టేస్ట్ అని, సీనియర్ నాయకురాలు అయి ఉండి ఇటువంటి సహాలు ఇస్తారా..అంటూ ఆయన మండిపడ్డారు. ఆమె సూచనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇప్పటికే పత్రికలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయని, న్యూస్‌ప్రింట్ ధరలు ఆకాశానంటుతున్నాయని, ఇతర ప్రచురణ ఖర్చులు పెరిగిపోయాయని, ఆదాయ మార్గాలన్ని ఇప్పటికే మూసుకుపోయాయని, ఇటువంటి తరుణంలో ప్రభుత్వం నుంచి ప్రకటలను నిలిపివేస్తే...పత్రికల మనుగడ సాధ్యం కాదని ఆయన అన్నారు. ఒక పత్రిక ముద్రించడానికి దాదాపు రూ.20/- నుంచి రూ.25/-లు అవుతుందని, ప్రచురణ కర్తలు దాన్ని కేవం రూ.5/- నుంచి రూ.6/-కు అమ్ముతున్నారని, మిగతా సొమ్మును కమర్షియల్, ప్రభుత్వ ప్రకటనల ద్వారా భర్తీ చేసుకుంటున్న విషయం ‘సోనియా’ తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇన్‌కమ్‌ట్యాక్స్, జిఎస్టి వంటి ప్రకటనలే విడుదల చేస్తుందని, ప్రభుత్వ కార్యక్రమాల ప్రకటనలను విడుద చేయడం లేదని, దాదాపు ఏడాది కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న, మధ్యతరహా పత్రికలకు ప్రకటను విడుదల చేయడం లేదని, ఇప్పుడు ఆమె చేసిన సూచనతో ఈ తరహా పత్రికలకు పూర్తిగా నష్టం కల్గుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అపారమైన రాజకీయ అనుభం కల్గిన ‘సోనియా’ ఫోర్త్ ఎస్టేట్ గురించి తెలుసుకోవాలని, ‘కరోనా’ వల్ల ఇప్పటికే మీడియా రంగం కుదేలైందని, ఇటువంటి తరుణంలో ఇలాంటి సూచను చేసి మరింతగా మీడియా రంగాన్ని దెబ్బకొట్టవద్దని ఆయన హితవు పలికారు. ఆమె చేసిన సూచనను తాము ఖండిస్తున్నామని, ఇప్పటికైనా ఆ సూచనను ఆమె విరమించుకోవాలని కె.ఎస్.రంగసాయి విజ్ఘప్తి చేశారు.