WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అమెరికాలో నరమేధం...!

అమెరికాలో మరో పాశవిక నరమేథం జరిగింది.ఫ్లోరిడా రాష్ట్రం ఓర్లాండోలోని పల్స్‌ గే నైట్‌ క్లబ్‌ లోకి చొరబడ్డ సాయుధుడు 20 మందిని కాల్చి చంపాడు. ఈ ఘటనలో మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు పల్స్‌ నైట్‌ క్లబ్‌ లోకి మారణాయుధాలతో ఓ సాయుధుడు చొరబడ్డాడని, పలువురిపై కాల్పులు జరిపి, ఇంకొందరిని బందీలుగా పట్టుకున్నాడని ఓర్లాండో పోలీసులు తెలిపారు. నాలుగు గంటల ఉత్కంఠత అనంతరం పోలీసులు దుండగుణ్ని మట్టుపెట్టారు. రెండు రోజుల కిందట పాప్‌ సింగర్‌ క్రిస్టినా గ్రిమ్మీని కాల్చిచంపిన ఓర్లాండో సిటీలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనారం. గే నైట్‌ క్లబ్‌ లో కాల్పులపై స్థానిక మీడియా పెద్ద ఎత్తున వార్తలు ప్రసారం చేసింది. కాల్పులు ప్రారంభమైన వెంటనే ఆ ప్రదేశాన్ని విడిచి దూరంగా పారిపోండంటూ క్లబ్‌ నిర్వాహకులు కస్టమర్లకు మెసేజ్‌ లు పెట్టారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.

(243)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ