WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అవును...ఆ పనిచేశాను...!

పసి పిల్లలకు డైపర్లు మార్చానని స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ చెప్పారు. పెళ్లి కాకుండానే పిల్లలకు డైపర్స్‌ ఎలా మార్చారనే దానిపై ఆయన వివరణ ఇచ్చారు. స్టార్‌ వరల్డ్‌ ఛానల్‌లో 'తారాశర్మ' నిర్వహిస్తున్న షోలో విరాట్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లల పెంపకం గురించి, మాట్లాడుతూ పిల్లలు తమకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవాలని సూచించారు. తనకు ఇష్టమైన క్రికెట్‌ను తాను ఎంచుకున్నానని ఆయన చెప్పారు. మరో వైపు షో సందర్భంగా కొంత పిల్లలకు 'కోహ్లీ' డైపర్స్‌ మార్చాడు. త్వరలోనే స్టార్‌ వరల్డ్‌ ఛానల్‌లో ఈ షో ప్రసారం కానుంది. కాగా తన ప్రియురాలు అనుష్కశర్మను కోహ్లీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. పిల్లలకు డైపర్స్‌ మార్చడంలో అనుభవం సంపాదించిన 'కోహ్లీ' పెళ్లి తరువాత ఈ అనుభవం బాగా పనికి వస్తుందని సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.

(201)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ