లేటెస్ట్

పాకిస్తాన్‌లో ఘోర విమానప్రమాదం:90మంది మృతి

పాకిస్తాన్‌లో ఘోర విమానప్రమాదం చోటు చేసుకుంది. లాహోర్‌ నుంచి కరాచీకి వెళ్తోన్న ఓ పౌర విమానం జనావాసాల‌పై పడడంతో దాదాపు 90 మంది మరణించినట్లు పాకిస్తాన్‌ అధికారులు ప్రకటించారు. ‘కరాచీ’లోని ‘జిన్నా’విమానాశ్రయంలో విమానం దిగుతున్న సమయంలో ‘విమానం’ ఒక్కసారిగా అదుపు తప్పి జనావాసాల‌పై పడిరది. విమానం ఒక్కసారిగా కుప్ప కూల‌డంతో భారీ ఎత్తున్న మంటలు, పొగలు వస్తున్నాయి. ప్రమాద స్థలానికి వెళ్లడానికి అటు పోలీసులు, ఇటు ప్రజలు భయపడుతున్నారు. విమానాశ్రయంలో భారీ స్థాయిలో ఉన్న పెట్రోలు, ఇతర రసాయనాలు మండుతాయనే భయంతో వారు ప్రమాద స్థలానికి వెళ్లడానికి భయపడుతున్నట్లు తెలుస్తోంది. విమానంలో మొత్తం 100మంది ప్రయాణీకులు ఉన్నట్లు పాక్‌ అధికారులు చెబుతున్నారు. వీరిలో 91మంది మ‌ర‌ణించిన‌ట్లు చెబుతున్నారు.

(702)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ