WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

భారత్‌ క్రికెట్‌ జట్టు కోచ్‌ 'అనిల్‌ కుంబ్లే'...!

భారత జట్టు కొత్త కోచ్‌గా అనిల్‌కుంబ్లే ఎంపికైనట్లు తెలుస్తోంది. సందీప్‌పాటిల్‌, టామ్‌మూడీ, స్టువర్ట్‌లా, ఆండీ మోల్స్‌ వంటి హేమాహేమీలు దరఖాస్తు చేసుకున్నా చివరకు కుంబ్లేనే ఎంపిక చేసినట్లు తెలిసింది. దేశ విదేశాల నుంచి మొత్తం 57 దరఖాస్తులు వచ్చాయి. 21 మందిని షార్ట్‌ లిస్ట్‌ చేశారు. బిసిసిఐ సలహా మండలి సభ్యులైన సౌరవ్‌ గంగూలీ, సచిన్‌ టెండుల్కర్‌, వివిఎస్‌ లక్ష్మణ్‌ కొత్త కోచ్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి కుంబ్లేకు ఓటేసినట్లు సమాచారం. బ్యాటింగ్‌ కోచ్‌గా రవిశాస్త్రిని, బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌ఖాన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

(205)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ