WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ద్రవిడ్‌' వద్దన్నారు...!

టీం ఇండియా క్రికెట్‌ కోచ్‌గా దిగ్గజ ఆటగాడు 'రాహుల్‌ ద్రావిడ్‌' ఎన్నిక కావాల్సిందని, కానీ ఆయన ఆ పదవిపై ఆసక్తి కనబరచకపోవడంతో 'అనీల్‌కుంబ్లే'ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. నిజానికి ఈ పదవి రాహుల్‌ ద్రవిడ్‌కు వచ్చి ఉండాలి. అందరూ కూడా అతనే హెడ్‌ కోచ్‌ అవుతాడని భావించారు. పలువురు విదేశీ క్రికెటర్లు కూడా ద్రవిడ్‌నే కోచ్‌గా ఉంటే బాగుంటుందని ప్రకటనలు కూడా చేశారు. అయితే ద్రవిడ్‌ను కాదని కుంబ్లేను హెడ్‌ కోచ్‌గా నిర్ణయిండానికి కారణం ద్రవిడ్‌నే. తాను కుంటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకున్నందువల్లే కోచ్‌ పదవిని వదులుకున్నాడట. అయితే కోచ్‌ ఎంపికలో కీలక పాత్ర పోషించిన సలహా కమిటీలో ఉన్న సచిన్‌, గంగూలి, లక్షణ్‌లతో పాటుగా కూడా ద్రవిడ్‌ లేకపోవడం విచారకరమే. ద్రవిడ్‌నే కోచ్‌గా నిర్ణయించాలని తాము భావించామని అయితే అందుకు ద్రవిడ్‌ నిరాకరించడంతో కుదరలేదని ఠాకూర్‌ చెప్పారు.



(443)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ