లేటెస్ట్

‘అచ్చెన్న’ కేసులో ‘ఏసీబీ’ పురోగతి సాధించిందా...!?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సంచల‌నం సృష్టించిన ఈఎస్‌ఐ కేసులో ‘ఏసీబీ’ ఎంత వరకు పురోగతి సాధించింది...? ఈఎస్‌ఐ కుంభకోణానికి ప్రధాన సూత్రధారుడిగా పేర్కొంటూ మాజీ మంత్రి, టిడిపిఎల్‌పి ఉపనేత ‘అచ్చెంనాయుడు’ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన ‘ఏసీబీ’ ఆయన నుంచి ఎంత సమాచారం రాబట్టిందనే దానిపై రాజకీయ, అధికార వర్గాల్లో ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఫైల్స్‌ ఆపరేషన్‌ చేయించుకున్న ‘అచ్చెంనాయుడు’ గుంటూరులో జీజీహెచ్‌లో చికిత్స పొందుతుండగానే ‘ఏసీబీ’ ఆయనపై విచారణ నిర్వహిస్తోంది. వరుసగా మూడు రోజుల‌ పాటు ఆయనను వివిధ రీతుల్లో ప్రశ్నించింది. ఈ కుంభకోణంలో ‘అచ్చెన్న’ పాత్ర ఏమిటి..? ఆయన ఎంత వరకు ల‌బ్ది పొందారు..? వచ్చిన సొమ్మును ఎక్కడ పెట్టారనే దాని చుట్టూనే ‘ఏసీబీ’ దృష్టి కేంద్రీకరించిందని తెలుస్తోంది. ఈఎస్‌ఐ స్కామ్‌లో తన పాత్ర లేదని, కేవలం తాను సిఫార్సు లేఖ మాత్రమే ఇచ్చానని, మందుల‌ కొనుగోలు అంశం డైరెక్టర్లదేనని ఆయన పదే పదే చెప్పినా ఏసీబీ అధికారులు మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తున్నట్లు స‌మాచారం. దాదాపు ఐదు గంట పాటు ఆయనను వేసిన ప్రశ్నే మళ్లీ వేసి సమాధానాలు రాబట్టడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మీ వ‌ల్ల‌ రూ.150కోట్ల రూపాయల‌ కుంభకోణం జరిగిందని, టెలీ హెల్త్‌ సర్వీసు ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్వహించిన టోల్‌ఫ్రీ, ఈసీజీ సేవల‌ను, నిబంధనల‌కు విరుద్ధంగా మందును కొనుగోలు చేస్తుంటే మీ దృష్టికి రాలేదా..అని ప్రశ్నించారని, మీరు చెబితేనే అధికారులు చేశామని చెబుతున్నారని, ఇది నిజమా కాదా..అని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే ఏసీబీ అధికారులు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా..‘అచ్చెన్న’ మాత్రం తాను మొదటి చెప్పిన దానికే కట్టుబడి ఉన్నారని, మందుల‌ కొనుగోలులో తన ప్రమేయం లేదని పాత మాటనే మళ్లీ చెప్పారని తెలుస్తోంది. మొత్తం మీద..మూడు రోజుల‌ పాటు ‘అచ్చెన్న’ను విచారించిన ‘ఏసీబీ’ మళ్లీ ఆయనను కస్టడీకి తీసుకోవాల‌ని భావిస్తున్నట్లు స‌మాచారం.

(527)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ