లేటెస్ట్

రాష్ట్రంలో ‘కరోనా’విల‌యతాండవం...!

రాష్ట్రంలో ‘కరోనా’ విల‌యతాండవం చేస్తోంది. గత 24గంటల్లో 3963 మందికి కరోనా పాజిటివ్‌ సోకిందని వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల‌ సంఖ్య 44,609కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 52 మంది మృతి చెందగా మొత్తం రాష్ట్రంలో 589 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో 12 మంది, కృష్ణా జిల్లాలో 8, అనంతపురం జిల్లాలో 7గురు, పశ్చిమగోదావరి జిల్లాలో 5గురు, ప్రకాశంలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, విశాఖపట్నంలో ఒకరు, చిత్తూరు, కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12.84 ల‌క్ష మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య,ఆరోగ్యశాఖ ప్రకటించింది.

(186)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ