లేటెస్ట్

‘కరోనా’తో మాజీ మంత్రి మాణిక్యాల‌రావు మృతి

కరోనా మమ్మారి మాజీ మంత్రి మాణిక్యాల‌రావును బలి తీసుకుంది. ఆయన నెల‌ రోజు క్రితం ‘కరోనా’ కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.  పరిస్థితి విషమించడంతో నెల‌ రోజుగా ఆయన విజయవాడలోని ఓ హాస్పటల్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. టిడిపి, బిజెపిలు కలిసి పోటీ చేసిన 2014 ఎన్నికల్లో ఆయన తాడేపల్లిగూడెం నుంచి బిజెపి తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఆయన ‘చంద్రబాబు’ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 2018 వరకు ఆయన మంత్రిగా పనిచేశారు. తరువాత బిజెపి, టిడిపి మధ్య నెల‌కొన్న విభేదాల‌తో ఆయన మంత్రివర్గం నుంచి వైదొలిగారు. మొదటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌లో మాణిక్యారావు పనిచేశారు. ఆయన మృతి పట్ల టిడిపి అధినేత ‘చంద్రబాబునాయుడు’ సంతాపం వ్యక్తం చేశారు. పలువురు బిజెపి నాయకులు, వైకాపా నాయకులు కూడా సంతాపం వ్యక్తం చేసి ఆయన ఆత్మకు శాంతి చేకూరాల‌ని కోరారు.

(259)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ