లేటెస్ట్

జడ్జి రామకృష్ణ పిటీషన్‌పై మాజీ సుప్రీం జడ్జితో విచారణ

హైకోర్టు ఉన్న ప్రాంతాన్ని రెడ్‌ జోన్‌గా ప్రకటించాల‌ని, హైకోర్టు ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ మృతిపై దర్యాప్తునకు ఆదేశించాల‌ని కోరుతూ బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ సభ్యుడు ల‌క్ష్మీనర్సయ్య హైకోర్టులో వేసిన పిటీషన్‌పై ఇంప్లీడ్‌ అయిన జడ్జి రామకృష్ణ పిటీషన్‌పై హైకోర్టు సంచల‌న ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల‌ను కుట్రపూరితంగా దెబ్బ కొట్టేందుకు భారీ కుట్ర జరిగిందని, దానికి ఆధారాలు ఉన్నాయని జడ్జి రామకృష్ణ హైకోర్టుకు తెలియ‌చేసి వాటిని సమర్పించారు. దీనిపై విచారించిన హైకోర్టు న్యాయమూర్తులు పెన్‌డ్రైవ్‌లోని సంభాషణను నిజనిర్ధారణ చేయాల‌ని, ఈ మేరకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్రన్‌కు బాధ్యతలు అప్పగించింది. దానితోపాటు విచారణ సాధ్యమైనంత త్వరగా ఇవ్వాల‌ని అవసరమైతే సీబీఐ, సెంట్రల్‌ విజిలెన్స్‌ అధికారులు సహకరించాల‌ని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాల‌ పాటు వాయిదా వేసింది. కాగా జడ్జి రామకృష్ణను ప్రలోభపెట్టి హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల‌పై ఆరోపణలు చేయించేందుకు ప్రణాళికను సిద్దం చేశారని, దీని వెనుక మాజీ హైకోర్టు న్యాయమూర్తి ఈశ్వరయ్య ఉన్నారని జడ్జి రామకృష్ణ ఆరోపించారు. తనతో ఈశ్వరయ్య సంభాషించిన టేపుల‌ను ఆయన మీడియాకు విడుదల‌ చేశారు. మాజీ జడ్జి ఈశ్వరయ్య వెనుక చాలా మంది పెద్దలు ఉన్నారని, దీనిపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాల‌ని రామకృష్ణ కోరారు. ఈ క్రమంలో ఇరుపక్షాల‌ వాదను విన్న హైకోర్టు దీనిపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరపాల‌ని ఆదేశించింది.

(356)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ