లేటెస్ట్

మానవత్వాన్ని చాటుకున్న యస్‌ఐ రామిరెడ్డి, శ్రీనివాసులు

ఆళ్ళగడ్డ,ఆగష్టు 23 (జనం ప్రతినిధి) : కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ పట్టణంలోని బస్టాండ్‌ ఆవరణంలో గుర్తుతెలియని వృధ్దుడు అకస్మాత్తుగా కిందపడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పట్టణ యస్‌ఐ రామిరెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి మరణించిన వ్యక్తి అనాధ అని తెలియటంతో సామాజిక వేత్త బృందావన్‌ కాలేజి అధినేత అయిన ఈపనగండ్ల శ్రీనివాసుల‌ను అక్కడికి పిలిపించి అనాథ శవానికి యస్‌ఐ రామిరెడ్డి, తన సిబ్బంది మరియు శ్రీనివాసులు అందరు కలిసి అంత్యక్రియులు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. కోవిడ్ -19తో గజగజ వణికిపోతున్న ఈసమయంలో ఎలాంటి సందేహం లేకుండా వట్టి చేతుల‌తో శవాన్ని మోసుకొని వెళ్తున్న యస్‌ఐ రామిరెడ్డిని చూసినవారు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఏదిఏమైనా మానవత్వంతో ఒక మంచి పనికి పూనుకొని అంత్యక్రియలు నిర్వహించి ప్రజల్లో ఉన్న కరోనా భయన్ని తొల‌గించటానికి ఆయన చేసిన ప్రయత్నానికి పలువురు అభినంధించారు.

(200)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ