లేటెస్ట్

‘అమరావతి’పై సెప్టెంబర్‌21 వరకు స్టేటస్‌కో పొడిగింపు

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఎ రద్దు చట్టాల‌పై హైకోర్టు మరోసారి స్టేటస్‌కో పొడిగించింది. రాజధాని అంశాల‌కు సంబంధించిన స్టేటస్‌కో నేటితో ముగుస్తున్ననేపథ్యంలో దీనిపై మరోసారి విచారణ జరిగింది. వచ్చే నెల‌ 21 నుంచి రోజు వారీ విచారణ జరిపేందుకు న్యాయవాదుల‌తో చర్చించింది. భౌతిక దూరం పాటిస్తూ హైకోర్టులోనే విచారణ జరిపేందుకు సిద్ధమని త్రిసభ్య ధర్మాసనం తెలిపిది. దీంతో సెప్టెంబర్‌21 వరకు స్టేటస్‌ కో అమలు గడువును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా పిటీషనర్‌ తరుపు సుప్రీంకోర్టు న్యాయవాది నితీష్‌ గుప్తా కోర్టు ధిక్కరణ పిటీషన్‌ దాఖలు చేశారు. విశాఖలోని కాపులుప్పాడలో రాష్ట్ర ప్రభుత్వం భారీ అతిథిగృహాన్ని నిర్మించతల‌పెట్టిందని, స్టేటస్‌కో అమలులో ఉన్నప్పుడు అతిథిగృహం ఎలా నిర్మాణం ఏమిటని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇది కార్యనిర్వాహక రాజధాని తరలింపులో భాగమేనని అన్నారు. కాగా దీనిపై సెప్టెంబర్‌10వ తేదీ లోపల‌ కౌంటరు దాఖలు చేయాల‌ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.

(235)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ