లేటెస్ట్

కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మృతి

కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ చ‌ల‌మ‌ల‌శెట్టి రామాంజ‌నేయులు ఈ రోజు ఉద‌యం మృతి చెందారు. కరోనా లక్షణాలతో  నాలుగు రోజుల క్రితం ఆయ‌న విజయవాడ జీ జీ హెచ్ లో చేరారు. అప్ప‌టి నుంచి ఆయ‌న‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.ఆయ‌న‌కు శ్వాస అంద‌క‌పోవ‌డంతో నాలుగు రోజుల నుంచి వెంటిలేట‌ర్ పై ఉంచి వైద్యం చేస్తున్నారు. చికిత్స పొందుతున్న ఆయ‌న ఈ రోజు ఉద‌యం మృతి చెందారు.  రామాంజనేయులు స్వస్థలం కలిదిండి మండలం అవ్వకూరు. రామాంజనేయులు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.తెలుగుదేశం ప్ర‌భుత్వం 2014లో అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత తొలిసారి కాపు కార్పొరేష‌న్ ను ఏర్పాటు చేసింది. దీనికి తొలి ఛైర్మ‌న్ గా చ‌ల‌మ‌ల‌శెట్టి వ్య‌వ‌హ‌రించారు. కాపు కార్పొరేష‌న్ ద్వారా ప‌లువురు కాపుల‌కు ఆయ‌న స‌హాయం చేశారు. రామాంజనేయులు స్వ‌స్థ‌లం ప‌శ్చిమగోదావ‌రి జిల్లా కలిదిండి మండలం అవ్వకూరు.

(314)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ