WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నిర్మల కాన్వెంట్‌' ట్రైలర్‌ విడుదల...!

హీరో శ్రీకాంత్‌ తనయుడు 'రోషన్‌' హీరోగా పరిచయమవుతున్న 'నిర్మల కాన్వెంట్‌' ట్రైలర్‌ను హీరో నాగార్జున సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. ఇది స్వచ్చమైన ప్రేమ కథని, తనకు ప్రేమ కథలంటే ఇష్టమని అందుకే ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించానని ఆయన చెప్పారు. నాగార్జున వాయిస్‌ ఓవర్‌ ఇస్తూ ఈ సినిమాలోని క్యారెక్టర్లను పరిచయం చేశారు. హీరోగా నటిస్తున్న రోషన్‌ పేరు శామ్యుల్‌ అని.. హీరోయిన్‌ శ్రేయాశర్మ పేరు శాంతి అని వీరు లవ్‌లో పడినట్టు చెబుతారు. కానీ శామ్యుల్‌ తననే ఛాలెంజ్‌ చేశాడని, చూద్దాం..గెలుపెవ్వరిదో అని నాగ్‌ ట్రైలర్‌లో చెప్పారు. రోషన్‌ నటన ఆకట్టుకునేలా ఉంది. శ్రేయాశర్మ నాయిక. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిందని చిత్రయూనిట్‌ తెలిపారు. అనితా చౌదరి, సమీర్‌, తాగుబోతు రమేశ్‌ ప్రధాన పాత్రలో నటించారు.



(539)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ