WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ముద్దు' పెట్టుకుంటే క్యాన్సర్‌ వస్తుందట...!

మీరు మీ భార్యనో...ప్రియురాలినో గాఢంగా ముద్దాడబోతున్నారా...? ఆగండి..ఇదోసారి విని...ఆ తరువాత మీరు చేయాలనుకున్న పనిని చేయండి. లిప్‌లాక్‌ కిస్‌తో క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందట. ఈ ప్రెంచ్‌కిస్‌ ద్వారా క్యాన్సర్‌ సోకే అవకాశాలున్నాయని ఆస్ట్రేలియాలోని రాయల్‌ డార్విన్‌ హాస్పిటల్‌లో హెడ్‌ అండ్‌ నెక్‌ సర్జరీ విభాగాధిపతి ప్రముఖ డాక్టర్‌ మహిబాన్‌ థామస్‌ పరిశోధనల్లో వెల్లడైంది. స్త్రీ, పురుషులు పరస్పరం పెదవులపై ముద్దుపెట్టుకోవడం వల్ల తల మెడ సంబంధమైన క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధన వెల్లడించింది. పెదవులపై ముద్దుపెట్టుకోవడం వల్ల ప్రతి సంవత్సరం పురుషులలో పదిశాతం, స్త్రీలలో ఏడు శాతం మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారని అమెరికాలో నిర్వహించిన మరో పరిశోధనలో వెల్లడైంది. చుంబనం ద్వారా సక్రమించే వైరస్‌ కారణంగా తల మెడ క్యాన్సర్లు ఎక్కువ వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

(370)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ