లేటెస్ట్

'చంద్రబాబు' నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు: స్పీకర్‌ తమ్మినేని

హిందూదేవాలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రతిపక్షనేత 'చంద్రబాబునాయుడు' నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం విమర్శించారు. రామతీర్థం ఘటనలో ప్రభుత్వం నిందితులను పట్టుకుని శిక్షించే ప్రయత్నం చేస్తుంటే 'చంద్రబాబు' నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని, ఇటువంటి రాజకీయాలు చేయడంతో గతంలో 'అలిపిరి' సంఘటన జరిగిందని, దాన్ని 'చంద్రబాబు' గుర్తుంచుకోవాలని సీతారాం ఘాటుగా వ్యాఖ్యానించారు. వేంకటేశ్వరస్వామి ఒక స్వారి హెచ్చరించినా 'చంద్రబాబు'కు ఇంకా బుద్దిరాలేదని, శ్రీరాముడు పుట్టిన రామభూమిలో జరిగిన ఈ ఘటనను ఎవరి  మీదకు నెట్టేస్తారని, మతాలు, కులాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు చేసిన కుట్రగా ఇది కనిపిస్తుందని ఆయన అన్నారు. దోషులు ఎవరైనా ప్రభుత్వం శిక్షిస్తుందని, ప్రభుత్వంపై బురదజల్లి రాజకీయ లబ్ది పొందాలని చూడటం సరికాదని, రాముడిని ఆరాధించే సమాజం మనదని, తప్పు ఎవరు చేసినా తప్పేనన్నారు. దేవాలయాల్లో జరుగుతున్న ఘటనలతో సిఎం జగన్‌పై బురద జల్లాలని చూస్తున్నారని, ఒకసారి గతానికి వెళ్లాలని, దేవాలయాలకు సంబంధించి ఎవరెన్ని కుంభకోణాలకు పాల్పడ్డారో చరిత్ర చెబుతుందని, వైకాపాకు వస్తున్న మద్దతు చూడలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతూ కుట్రతో, పథకం ప్రకారం దేవతా విగ్రహాలను ధ్వంసం చేసి 'జగన్‌'పై ఆరోపణలు చేస్తున్నారని, మనుషుల్లో దేవుడిని చూసే గొప్ప మానవతావాది సిఎం జగన్‌ అని ఆయన అన్నారు. శ్రీరామచంద్రుడిని పూజించే గొప్ప వ్యక్తి జగన్‌ అని, అలాంటి వ్యక్తిపై నీలాపనిందలు వేయడం సరికాదని, జగన్‌పై వస్తోన్న ఆరోపణలను అందరూ ముక్తకంఠంతో ఖండించాలని, దేవాలయాల్లో విధ్వంసాలకు పాల్పడుతున్న వారు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ సీతారాం ప్రభుత్వాన్ని కోరారు. 

(141)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ