'ఏబీవీ'కి ఊరట
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనను శని, ఆదివారాల్లో అరెస్టు చేసి జైలుకు పంపి కసి తీర్చుకోవాలని చూస్తోందని, దీన్ని అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సస్పెండ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టుకు ఊరటనిచ్చింది. ఆయనను అరెస్టు చేయవద్దంటూ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తుదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ కేసును 18వ తేదీకి వాయిదా వేసింది. ఏబీవీ తరుపున సీనియర్ లాయర్ ఆదినారాయణరావు వాదించారు. ప్రభుత్వం తనను అకారణంగా సస్పెండ్ చేసి, జీతం ఇవ్వకుండా వేధిస్తోందని ఆయన ఇంతకు ముందు ఆరోపించారు.