లేటెస్ట్

రజకులు రాజకీయంగా చైతన్యవంతులు కావాలి

రజకులు గత దశాబ్దాలుగా అన్ని రంగాలలో వెనుకబడి దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రాజకీయంగా చైతన్యవంతులు కావాలని ఏపీ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.రాంబాబు పేర్కొన్నారు.ఆదివారం రుద్రవరంలో అల్వకొండ మద్దిలేటి అధ్యక్షతన మండల రజక నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యం. రాంబాబు, మద్దిలేటి ,రాజుహాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ రజక సంఘం అనేది ఒక పెద్ద కుటుంబం, గుడి లాంటిదని ఆయన పేర్కొన్నారు గ్రామాల్లో ప్రజలు బట్టలు శుభ్రం చేసేందుకు వచ్చినందుకు మేరా పెంచమని అడిగితే సాంఘిక బహిష్కరణ చేస్తూ మహిళలపై అత్యాచారాలు అరాచకాలు చేస్తున్నారని నేటి ప్రజాస్వామ్యంలో కూడా రజకులను హీనంగా చూస్తూ దౌర్జన్యాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రజకులకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన ప్రజల సమస్యల కోసం ఈ రాష్ట్రంలో ఒక సంఘం ఉందని అందరూ ఐక్యమత్యంతో మెలగుతూ మన హక్కుల కోసం మన రాయితీల కోసం పోరాడాలన్నారు అంతేకాకుండా తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనీ విద్యావంతులైనప్పుడు మాత్రమే ఆర్థికంగా, సామాజికంగా ,రాజకీయంగా ,రాణించగలరని ఆయన అన్నారు రజక సంఘం పెద్దలు కూడా గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను గుర్తించి ఆ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసేలా ఉండాలని ఆయన తెలిపారు తరతరాలుగా రజకులు కులవృత్తిని నమ్ముకొని జీవిస్తూ ఉన్నప్పటికీ మరియు చాలాచోట్ల దోబీఘాట్ లేక చాలా దూరం  వెళ్లాల్సి వస్తుందని ప్రతి గ్రామంలో దోబీ ఘాట్ లు ఏర్పాటు చేయాలని అన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా రజకులకు ప్రతి సంవత్సరం బీసీ కార్పొరేషన్ ద్వారా రజక బడ్జెట్ కేటాయించాలని  ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్. చేశారు.సమావేశానంతరం రుద్రవరం మండల నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది .ఈ నూతన కమిటీలో మండల అధ్యక్షులుగా సి.పకీరయ్య, ఉపాధ్యక్షులుగా పల్లె మౌలాలి ,కార్యదర్శి బాలుడు, సహాయ కార్యదర్శిగా పల్లె. నరసింహులు ,కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, రమేష్ లను ఏకగ్రీవంగా నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆల్వకొండ మద్దిలేటి ,రాష్ట్ర కార్యదర్శి జి రాజు, జిల్లా నాయకులు నంద్యాల రాము, ఆళ్లగడ్డ రమణ, ముత్యాలపాడు రాజు ,వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

(265)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ