టూరిజం అధికారుల తప్పేం లేదు...కావాలంటే ఈ వీడియో సాక్ష్యం చూడండి...(వీడియో) 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టూరిజం అధికారుల తప్పేం లేదు...కావాలంటే ఈ వీడియో సాక్ష్యం చూడండి...(వీడియో)16మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న పడవ ప్రమాదంలో టూరిజం శాఖ అధికారుల తప్పేం లేదని తెలుస్తోంది. రివర్‌ బోటింగ్‌ అడ్వంచర్‌ సంస్థ అక్రమంగా ప్రయాణీకులను ఎక్కించుకుని వారి ప్రాణాలను బలిగొందని ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. ఆదివారం ఉదయం రివర్‌ బోటింగ్‌ అడ్వంచర్‌ సంస్థ తన బోట్‌ను దుర్గా ఘాట్‌కు తీసుకువచ్చిన సందర్భంలో దానికి అనుమతి లేదని...తాము ఇక్కడ నుంచి ప్రయాణీకులను ఆ బోట్‌లోకి ఎక్కనివ్వమని టూరిజం శాఖ అధికారి వారికి స్పష్టంగా చెప్పారు. దానికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. రివర్‌ బోటింగ్‌ సంస్థ ప్రతినిధులకు టూరిజం అధికారులకు మధ్య జరిగిన సంభాషణలో దీనిలో స్పష్టంగా కనిపిస్తోంది. జట్టీ దగ్గర పవడ నిలపడానికి అనుమతి లేదని, దాన్ని అక్కడ నుంచి తీసివేయాలని ఆ అధికారి స్పష్టం చేశారు. పడవను తీసివేయకపోతే తానే తొలగిస్తానని కూడా హెచ్చరించారు. దీనిపై రివర్‌ బోటింగ్‌ సంస్థ ప్రతినిధులు తాము జిఎం అనుమతి తీసుకున్నామని చెబుతుండగా ఆయన పట్టణంలోనే ఉన్నారని ఆయనతో మాట్లాడించాలని టూరిజం అధికారి స్పష్టం చేశారు. అయినా వినకుండా మొండిగా ప్రయాణీకులను తీసుకెళ్లి వారి ప్రాణాలు పోవడానికి రివర్‌ బోటింగ్‌ సంస్థ కారణం అయింది. దొంగచాటుగా పడవను నడిపి అమాయకులైన పర్యాటకుల ప్రాణాలను తీసిన ఆ సంస్థపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

 
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ