టిడిపి కూటమికి 161 సీట్లు
అందరూ ఎంతో ఉత్కంఠతగా ఎదురుచూస్తోన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలనుపలు సంస్థలు ప్రకటిస్తున్నాయి. దీనిలో ఎక్కువ సంస్థలు టిడిపి కూటమి అధికారంలోకి వస్తుందని ప్రకటిస్తున్నాయి. ఆయా సంస్థలు వాటి అంచనాలను విడుదల చేస్తున్నాయి. కెకె సర్వేలో టిడిపి కూటమికి 161 వస్తుందని ప్రకటించాయి. ఆ సంస్థ సర్వే ప్రకారం టిడిపి కూటమికి 161 సీట్లు, వైకాపాకు 14 సీట్లు వస్తాయని ప్రకటించింది. ఆ సంస్థ సర్వే ప్రకారం 144 సీట్లలోపోటీ చేసిన టిడిపికి 131 సీట్లు, 21 సీట్లలో పోటీ చేసిన జనసేన మొత్తం 21 సీట్లులోనూ, బిజెపి పోటీ చేసిన 10 స్థానాల్లో 7 స్థానాల్లో గెలుపొందబోతుందని సర్వే సంస్థ ప్రకటించింది.
జిల్లాల వారీగా ఫలితాలు
శ్రీకాకుళం (10) టిడిపి కూటమి (10) వైకాపా (0)
విజయనగరం (9) టిడిపి కూటమి (9) వైకాపా (0)
విశాఖపట్నం (15) టిడిపి కూటమి (14) వైకాపా (1)
తూర్పుగోదావరి (19) టిడిపి కూటమి (18) వైకాపా (1)
పశ్చిమగోదావరి (15) టిడిపి కూటమి (15) వైకాపా (0)
కృష్ణా (16) టిడిపి కూటమి (16) వైకాపా (0)
గుంటూరు (17) టిడిపి కూటమి (17) వైకాపా (0)
ప్రకాశం (12) టిడిపి కూటమి (11) వైకాపా (1)
నెల్లూరు (10) టిడిపి కూటమి (8) వైకాపా (2)
చిత్తూరు (14) టిడిపి కూటమి (11) వైకాపా (3)
అనంతపురం (14) టిడిపి కూటమి (14) వైకాపా (0)
కడప (10) టిడిపి కూటమి (7) వైకాపా (3)
కర్నూలు (14) టిడిపి కూటమి (11) వైకాపా (3)
మొత్తం: టిడిపి కూటమి 161, వైకాపా : 14