లేటెస్ట్

ఇంత దిగజారుడు విమర్శలా...?

సింహం సింగిల్‌గా వస్తోంది..ప్రతిపక్షం తోడేళ్లవలే తమపై దాడి చేస్తోంది..ఎంత మంది వచ్చినా..ఎందరు కలిసి వచ్చినా..తమదే విజయమని ఇన్నాళ్లూ ఊదరగొట్టిన వైకాపా నేతలకు ఇప్పుడిప్పుడే..అసలు తత్వం బోధపడుతోంది. స్వంత జిల్లాలోనే..ఎదురుగాలులు వీస్తుండడంతో..ఏమి చేయాలో తెలియని స్థితిలో మానసిక స్థైర్యాన్ని కల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చివరకు స్వంత చెల్లులు, స్వంత బాబాయిపై కూడా అవకాలు చెవాకులు పేలుతున్నారు. ఇన్నాళ్లూ స్వంత చెల్లెలు, బాబాయ్‌, బాబాయ్‌ కూతురిపై అంభాడాలు వేసే పని పార్టీ నాయకులు, సోషల్‌ మీడియా కార్యకర్తలకు అప్పచెప్పిన వైకాపా అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడా పనిని ఆయనే తలెత్తుకున్నారు. చెల్లెలను, బాబాయ్‌ను దూషిస్తూ ఆయన ఈ రోజు చేసిన ప్రసంగం సంచలనం సృష్టిస్తోంది. స్వంత బాబాయికి అక్రమసంబంధాలు ఉన్నాయని, తన చెల్లెలు తాను పనులు చేయలేదని ప్రత్యర్థి శిబిరంలోకి వెళ్లిపోయారని ఆయన ఆరోపించారు. ‘వివేకా’ హత్యకేసులో సీబీఐ నిందితుడిగా పేర్కొన్న ‘కడప’ ఎంపి వై.ఎస్‌. అవినాష్‌రెడ్డి అమాయకుడంటూ..ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనలోని అసహనానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఒకవైపు కూటమి తరుముకొస్తుంటే..స్వంత బంధువులే.. తన ఓటమికి కృషి చేస్తుంటే..ఏమి చేయాలో తెలియని స్థితిలో ఆయన వారిపై నోరు పారేసుకుంటున్నారు. ‘పులివెందుల’లో ఈ రోజు వై.ఎస్‌.జగన్‌ నామినేషన్‌ వేసి తరువాత నిర్వహించిన సభలో ఆయ న మాట్లాడిన మాటలతో స్వంత చెల్లి వల్ల తనకు నష్టం జరుగుతుందనే భావనతో..ఆమెపై అనగూడనిమాటలు మాట్లాడి అభాసుపాలయ్యారు. చివరకు ఆమె కట్టుకునే చీర గురించి కూడా మాట్లాడి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇంత దిగజారుతారా..? అన్నట్లు వ్యవహరించారు. తనతో విభేదిస్తే..స్వంత వారైనా..పరాయివారైనా..ఇదే గతంటూ..ఆయన తన స్థాయిని బహిరంగంగా వ్యక్త పరుచుకున్నారు. మాట్లాడితే..మాట తప్పం..మడమ తిప్పం..అని చెప్పుకునే వ్యక్తి..ఐదేళ్లనాడు..తన స్వంత బాబాయి హత్యకు గురైతే..దాని గురించి మాట్లాడుకుండా, న్యాయం కావాలని నినదిస్తోన్న చెల్లెళ్లపై అంభాండాలు వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పదవిలో ఉన్న వ్యక్తి..బాబాయి హత్యలో నిందితులను ఎందుకు పట్టుకోలేదన్న ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా బాధిత కుంటుంబంపైనే నిందలు వేయడం, హత్య కేసులో ఉన్న నిందితుడిని బహిరంగంగా వెనుకేసుకురావడంతోనే..‘వివేకా’ కేసులో ఏమి జరుగుతుందో..జనాలకు అర్థం అవుతోంది. ఐదేళ్లుగా తాను ఆడిన నాటకాన్ని..ఇప్పుడు చెల్లెళ్లు బహిర్గతం చేయడంతో..తన నిజస్వరూపం ప్రజలకు తెలియడంతో..ఏమి చేయాలో పాలుపోని స్థితిలో..తన స్వంత నియోజకవర్గంలో ఎదురువుతున్న సవాళ్లను తట్టుకోలేక..ఈరోజు ఆయన బరస్ట్‌ అయ్యారనే భావన స్వంత పార్టీలోనే వ్యక్తం అవుతోంది. మొత్తం మీద..స్వంత చెల్లి రోజూ ‘వివేకా’ హత్య విషయంలో, తన ఐదేళ్ల పాలన విషయంలో చేస్తోన్న విమర్శలకు ‘జగన్‌’కు నిద్రలేకుండా చేస్తోంది. చివరకు స్వంత నియోజకవర్గంలో..కూడా ‘షర్మిల’ ఆయనను భయపెడుతోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ