లేటెస్ట్

‘మోడీ’ది ‘శల్యసారధ్యమేనా..?

మరో 46 రోజుల్లో జరగనున్న ‘ఆంధ్రప్రదేశ్‌’ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సంసిద్ధం అవుతున్నాయి. అధికార వైకాపా...2014లో అధికారంలోకి వచ్చిన రోజునుంచే..2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని..ఓట్ల కొనుగోలు పథకాలకు తెరతీసింది. ఆ పార్టీ దృష్టాంతా..మళ్లీ గెలవడంపైనే..ఉంది. దానిలో భాగంగా ప్రజలను వీలైనంతగా ‘భిక్షగాళ్ల’ను చేసే పథకాలను అమలు చేసి, పేద ప్రజల ఓట్లను టోకు లెక్కన కొనుగోలు చేసింది. ఎవరు ఎంతగా ఆక్రోశించినా, ఆందోళన చెందినా..వాటిని పట్టించుకోకుండా ఎడాపెడా అప్పులు చేసి, ఓట్ల కొనుగోలు పథకాలను విజయంతంగా అమలు చేసింది. ఓట్ల పండుగకు మరో నెలన్నర రోజులు ఉండడంతో..తాము కొనుగోలు చేసిన ఓటర్లు తమనే గెలిపిస్తారనే ధీమాతో ఉంది. అయితే..ఓట్ల కొనుగోలుపైనే ఆధారపడకుండా...తమను కంటికి రెప్పలా కాపాడుతున్న ‘మోడీ’కి తమను గెలిపించే బాధ్యతను అప్పగించింది. ఈ బాధ్యతను ఆయన సంతోషంగా స్వీకరించినట్లు కనిపిస్తోంది. అయితే..గత ఎన్నికల్లో వలే నేరుగా ‘వైకాపా’కు మద్దతు ఇవ్వకుండా...తాము ప్రతిపక్షం వైపు ఉన్నట్లు నటిస్తూ..‘దత్తపుత్రుడి’ గెలుపుకోసం చేయాల్సినదంతా చేస్తున్నారు. ‘మహాభారతం’లో ‘శల్యుడి’ని గుర్తు చేస్తూ..‘మోడీ’ ఇక్కడ తన సారధ్యంలోని ‘ఎన్‌డిఏ’ కూటమి ఓటమికి తన వంతు పాత్రపోషిస్తున్నారు. ‘శల్య’ పాత్ర అన్నానని, టిడిపి,జనసేనలు ‘కౌరవసేన’ కాదు..అదే విధంగా, ‘వైకాపా’ పాండవసేన కాదు..కేవలం..సారూప్యత కోసం వినియోగించిన పదమే. మహాభారతంలో ‘శల్యుడి’ మనస్సంతా ‘పాండవుల’వైపే ఉంటుంది..కానీ,అనుకోని పరిస్థితుల్లో ‘కౌరవుల’వైపు ఉండాల్సి వస్తుంది. దీంతో..ఆయన ‘కౌరవుల వైపు యుద్ధం చేస్తూ కూడా..పాండవులే..గెలవాలని కోరుకున్నారు. ఆధునిక ‘భారత’ చరిత్రలో మన ‘శల్యుడి’ పరిస్థితి..అదే..పేరుకే..‘కూటమి’వైపు..మనస్సంతా..‘దత్తపుత్రుడి’వైపే..‘దత్తపుత్రుడి’కి ఎటువంటి బాధలు లేకుండా..కూటమి వైపు ఉండి..కూటమిలో ‘శల్యసారధ్యం’ చేస్తూ...వైకాపాను గెలిపించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు..మన ఆధునిక ‘శల్యుడు’. కౌటిల్యుడి’ కుఠిలవ్యూహాలను సైతం తోసిరాజని, ఆధునిక ‘శల్యుడి’ చేస్తోన్న..రాజకీయ కుటిలవ్యూహాలను చూసి...ఔరా...! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు...‘ఆంధ్రా ప్రజలు’. రాజకీయాల్లో ఎన్నో వెన్నుపోట్లు చూశాం..మరెన్నో..అరాచకాలు, అక్రమాలు చూశాం... కానీ..ఇంత దుర్మార్గ రాజకీయాలను ఇప్పుడే చూస్తున్నాం..అంటూ నోరెళ్లబెడుతున్నారు.ఒక నియంత, అరాచకవాది, అవినీతిపరుడు, అక్రమార్కుడు, మూర్ఖుడు, వివేకం, విజ్ఞతలేని వ్యక్తి కోసం....అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇంతగా దిగజారాలా..?ఇంతగా..వ్యవస్థలను భ్రస్టు పట్టించాలా..? ఇవెక్కడి రాజకీయాలు..ఇక దిగజారడానికి ఇంకేం ఉంది... అంటూ ‘జనం’ విస్తుపోతున్నారు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ