లేటెస్ట్

ప్రతిభావంతులైన ఫోటోగ్రాఫర్స్ కు చెక్కుల పంపిణీ

హైదరాబాదులోని ఎల్బీనగర్లో చైతన్య ఎడ్యు గుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన మెరిట్ స్టూడెంట్స్ కు చైతన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు మూడున్నర లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ కృష్ణయ్య, కలర్స్ డిజిటల్ ప్రెస్ డైరెక్టర్ రజిని , మార్కెటింగ్ హెడ్ సుబ్బరాజు హాజరై అర్హులైన ఫోటోగ్రాఫర్స్ వాళ్ల పిల్లలకు  చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ మారుపూడి కృష్ణ చైతన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రఫీ కమ్యూనిటీ నుండి ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు స్కాలర్షిప్ లను అందజేయనున్నట్లు తెలిపారు.   నిరుపేద విద్యార్థులను ఆర్థికంగా ఆదుకొని వారిలోని ప్రతిభను వెలికి తీయాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని ట్రస్ట్ చైర్మన్ మారుపూడి భాస్కర రావు ట్రస్ట్ మెంబర్స్ మారుపూడి సూర్యకుమారి  మారుపూడి వంశీకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ అసోసియేషన్  సంస్థలోనే సభ్యులు, ఫోటోగ్రాఫర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ